Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

5 దక్షిణాది రాష్ట్రాలు, 16 మంది ఆకాంక్షాపూరిత కళాకారులు, కర్నాటక సంగీత కచేరి

5 దక్షిణాది రాష్ట్రాలు, 16 మంది ఆకాంక్షాపూరిత కళాకారులు, కర్నాటక సంగీత కచేరి
, సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (18:24 IST)
హద్దుల్లేని భారతీయ సంగీత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేలా స్కోడా ఇండియా ఔత్సాహిక సంగీతకళాకారుల కోసం మరో సంగీత వేదికను నిర్వహిస్తోంది. ఈ దఫా దక్షిణ భారతదేశ దేశీయ సంగీత ప్రతిభను ప్రోత్సహించడంపై ప్రధానంగా దృష్టి పెట్టింది.

 
స్కోడా దక్కన్ బీట్స్ అనేది కర్నాటక సంగీత కారవాన్. లక్ష్య ఈవెంట్ క్యాపిటల్, బీటీఓఎస్ ఆర్టిస్ట్ మేనేజ్మెంట్‌లతో కలసి పిహెచ్‌డి మీడియా, ఓఎంజీ కంటెంట్‌లచే రూపుదిద్దబడి, నిర్వహించబడుతున్న అత్యున్నత స్థాయి బ్రాండెడ్ క్యాంపెయిన్. 2022 ఫిబ్రవరి 14న ఇది ప్రారంభించబడింది. రాగ కేంద్రిత మెలోడీలతో సాంస్కృతిక సంబంధిత ప్రతిభకు వేదికగా కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు సంగీతాల సౌందర్యాన్ని ఆస్వాదించేలా ఏర్పాటు చేసిన కార్యక్రమం.

 
సంగీతాన్ని ప్రోత్సహించడం అనేది స్కోడా ఆటో ఇండియాకు అత్యంత ఇష్టమైన వాటిలో ఒకటి. ఆశ, సాహసం సమ్మిళితంగా జరిగే ప్రయాణాని ఇది గుర్తు చేస్తుంది. కస్టమర్లతో పాటుగా ఇది తన ప్రయాణాన్ని సాగిస్తుందని ఈ బ్రాండ్ విశ్వసిస్తోంది. విజయవంతమైన సంగీత సారథ్య కార్యక్రమాల నేపథ్యంలో ఈ ఆటోమొబైల్ బ్రాండ్ గత ఏడాది సోనిక్ రూట్స్, టిప్స్ రివైండ్ వంటి కార్యక్రమాలను నిర్వహించింది. మాండలికాలు, భాషలు, సంగీతాలతో సుసంపన్నమైన ప్రాంతంలో ప్రజలను ఒక్కచోటకు చేర్చే అవకాశాలను గుర్తించింది. నేటి కర్నాటక సంగీత రూపకర్తలపై, దాని వెనుక ఉన్న నమ్మశక్యం కాని గాధలపై దక్కన్ బీట్స్ వెలుగులు ప్రసరింపజేయనుంది.

 
ఈ సందర్భంగా పిహెచ్‌డి మీడియా ఇండియా సీఈఓ మోనాజ్ టోడీవాలా మాట్లాడుతూ, దక్షిణ భారతదేశ మార్కెట్లో ఈ వాహన అగ్రగామి ఉనికిని మెరుగుపరుచుకునే అవకాశాల గురించి వివరించారు. ‘‘సంగీతానికి సరిహద్దులు లేవనే విషయం మనందరికీ తెలుసు. ఇది ప్రజలందరినీ అనుసంధానం చేసే మాధ్యమం. కొనుగోలుదారులతో తన అనుబంధాన్ని పటిష్టం చేసుకునేందుకు సంగీతాన్ని ఉపయోగించుకునే అవకాశాలపై స్కోడా దీన్ని చేపట్టింది. దక్కన్ బీట్స్ అనేది ప్రతిభావంతులను వెలికితీయడం, రసాస్వాదనకు వీలు కల్పించడం ద్వారా చేసే మరో ఆకాంక్షాపూరిత సంగీతప్రయాణం. స్కోడా భావోద్వేగభరిత సంగీత కార్యక్రమ నిర్వహణలో పిహెచ్‌డి మీడియా కూడా పాలుపంచుకుంటోంది’’ అని అన్నారు.

 
స్కోడా ఆటో ఇండియా మార్కెటింగ్ హెడ్ తరుణ్ ఝా ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘దక్కన్ బీట్స్ అనేది స్కోడా ఇండియా చిరకాల కోరిక. దక్షిణ భారతదేశ మార్కెట్లో ఏదైనా ప్రత్యేకంగా చేయాలని స్కోడా ఇండియా భావిస్తోంది. కొనుగోలుదారులకు సుసంపన్న, ప్రత్యేక అనుభూతులను అందించడాన్ని ఈ బ్రాండ్ విశ్వసిస్తుంది. దక్షిణ భారతదేశంలోని ప్రతిభను వెలికితీసేందుకు దక్కన్ బీట్స్ సరైన వేదిక. కర్నాటక సంగీత సాధనలో మొగ్గ తొడుగుతున్న ప్రతిభావంతులను గుర్తించేందుకు, పిహెచ్‌డి మీడియా డిజిటల్ నైపుణ్యాలతో ఇది ఒక నిజమైన అవకాశంగా దీన్ని అందిస్తున్నందుకు మేమెంతగానో ఆనందిస్తున్నాం’’ అని అన్నారు.

 
ఈ సిరీస్ మూడు విలక్షణ దశల్లో ఉంటుంది. టాలెంట్ హంట్, ఆన్- రోడ్, గారేజ్ సిరీస్. నాలుగు రాష్ట్రాల నుంచి 16 మంది వర్ధమాన ప్రతిభావంతులైన కళాకారులు ఇందులో పాల్గొంటారు. ఈ ప్రతిభావంతులకు అండ్రెయా జెరెమియా (తమిళం), గీతా మాధురి (తెలుగు), సితార కృష్ణకుమార్ (మలయాళం), రఘు దీక్షిత్ (కన్నడ) తమ సూచనలు, సలహాలు అందిస్తారు.
 
 
ఒమ్నికామ్ మీడియా గ్రూప్ ఇండియా (ఓఎంజి) చీఫ్ కంటెంట్ ఆఫీసర్ శైలజా సరస్వతి మాట్లాడుతూ, ‘‘స్కోడా దక్కన్ బీట్ అనేది, భారతీయ సంస్కృతితో ప్రగాఢంగా అల్లుకుపోయిన శక్తివంతమైన సంగీత మాధ్యమం చుట్టూరా నిర్మితమైంది. ప్రయోగాత్మక క్యాంపెయిన్ కింద, విశిష్ట బ్రాండెడ్ కంటెంట్ అండతో ఇది దక్షిణాది రాష్ట్రాల వర్ధమాన సంగీతకళాకారుల ప్రతిభను చాటిచెప్పనుంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ రంగంలో నిలదొక్కుకున్న సంగీతకళాకారుల మెంటర్‌షిప్‌ను కూడా వారికి అందించనుంది. ఇది ఈ ప్రాంతంలో స్కోడా ఇండియా కస్టమర్ కనెక్ట్‌ను మరింత సుసంపన్నం చేయనుంది’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిత్రుని కోసమే భీమ్లా నాయక్ ప్రిరిలీజ్ ఈవెంట్ రద్దు : పవన్ కళ్యాణ్