Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత ఆహార సంస్థలో 5,043 ఉద్యోగా పోస్టులు

fci notification
, శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (15:29 IST)
భారత ఆహార సంస్థలో 5043 ఉద్యోగ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నార్త్ జోనా, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్‌లకు చెందిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు.. ఆయా పోస్టులను బట్టి స్పెషలైజేషన్ గ్యాడ్యుయేషన్, బికాం, ఈఈ, ఎంఈ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాదించి ఉండాలి. అలాగే, టైరింగ్ స్కిల్క్, ట్రాన్స్‌లేషన్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్‌తో పాటు సంబంధిత పనిలో అనుభవం కలిగివుండాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుని వయసు 21 యేళ్ల నుంచి 28 యేళ్ల మధ్య ఉండాలి. 
 
ఈ నెల 6వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు అక్టోబరు 5వ తేదీ లోపు ఆన్‌లైన విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.28,200 నుంచి రూ.1,03,400 వరకు వేతనం ఇస్తారు. 
 
పరీక్షలో మొత్తం 100 మల్టీపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కులకు గాను మొత్తం 60 నిమిషాల వ్యవధిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఆప్టిట్యూట్, జనరల్ స్టడీస్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పూర్తి వివరాలకు https://fci.gov.in/ అనే వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 
 
జోన్ల వారీగా పోస్టులను పరిశీలిస్తే, నార్తో జన్‌లో 2,388, సౌత్ జోన్‌లో 987, ఈస్ట్ జోన్‌లో 768, వెస్ట్ జోన్‌లో 713, నార్త్ ఈస్ట్ జోన్‌లో 185 పోస్టులు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐఎన్ఎస్ విక్రాంత్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ