Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వివిధ పోస్టులు

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వివిధ పోస్టులు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ కేటగిరీల కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో లోయర్ డివిజన్ క్లర్కులు (ఎల్‌డీసీ) పోస్టులు 29 ఉన్నాయి. ఈ పోస్టులకు వేతన శ్రేణి కింద రూ.5200+20200+ 1900 చొప్పున చెల్లిస్తారు. విద్యార్హతగా ఇంటర్మీడియెట్ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతో పాటు నిమిషానికి 35 పదాలు ఇంగ్లిష్ లేదా 30 పదాల హిందీ టైప్ రైటింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.

అలాగే, జూనియర్ అకౌంటెంట్ విభాగంలో 45 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు బీకాంతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. ఈ పోస్టులకు ఎంపిక రాత పరీక్ష ద్వారా నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు కింద సెక్రటరీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో చెల్లేలా తీసిన రూ.500 డీడీని దరఖాస్తుతో జత చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను ఏప్రిల్ 15 తేదీలోపు పంపించాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu