Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిరుపేద బాలికలకు గగన విహారం - చెన్నై టు హైదరాబాద్ ఉచిత ప్రయాణం

kids flght journey
, సోమవారం, 30 మే 2022 (08:19 IST)
రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్ ఇండియా సంయుక్తంగా 30 నిరుపేద అమ్మాయిలకు ఉచిత గగన విహారం చేసే భాగ్యాన్ని కల్పించింది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఉచితంగా తీసుకెళ్లింది. రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్ ఇండియా, మద్రాస్ ఎస్‌‌ప్లనేడ్ ఆర్టీ 30, మద్రాస్ నైట్స్ ఆర్టీ 181 కలిసి మొత్తం 30 మంది పేద బాలికలను ఇండిగో విమానంలో గగన విహారం కల్పించే అవకాశాన్ని కల్పించింది 
 
అంకుల్ సామ్స్ కిచెన్ అల్పాహారాన్ని భుజించడంతో ప్రారంభమైన చిన్నారులు.. తమ గుర్తింపు కార్డులతో విమానాశ్రయంలోకి అడుగుపెట్టారు. అక్కడ క్రమబద్ధమైన చెక్ఇన్ ప్రాసెస్ ముగిసిన తర్వాత విమానం వద్దకు పంపించారు. హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత పిల్లలు కాక్‌పిట్ సిబ్బందితో పాటు పైలట్, సహ పైలెట్‌తో కలిసి ప్రత్యేకంగా ఫోటోలు తీసుకున్నారు.
webdunia
 
విమానాశ్రయం నుండి వండర్‌లా థీమ్ పార్కుకు లాజిస్టిక్‌లను సమన్వయం చేస్తూ, చిన్నారులను ఉత్సాహపరుస్తూ ఈ యాత్ర సాగింది. ఈ యాత్రలో ఆవడిలోని మాంటిస్సోరి స్కూలు, మనలిలోని వివేకానంద విద్యాలయానికి చెందిన 12-16 యేళ్ల బాలికలు ఉన్నారు. వీరందరినీ హైదరాబాద్‌కు తీసుకెళ్లి రోజంతా వినోదం కల్పించారు. దీంతో చిన్నారుల ఆనందానికి అవధుల్లోకుండా పోయాయి. తాము కలలో కూడా ఊహించని అవకాశాన్ని కల్పించిన ఆయా సంస్థల నిర్వహకులకు చిన్నారులు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. 
 
కాగా, దీనిపై ఆ సంస్థల ఛైర్మన్లు స్పందిస్తూ, ​​అరిహంత్ పరాఖ్ (మెర్ట్ -30) సునీల్ బజాజ్ (ఎంకెఆర్టి -181), వివేక్ మహేశ్వరి (హోర్ట్ -212)లు సూచలు, సలహాలు ఇచ్చారు. దీనిపై వారు  స్పందిస్తూ, 'చిన్నారుల ముఖాల్లో చిరునవ్వు చూసినపుడు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదన్నారు. "ఫాంటసీ ఫ్లైట్" అనుభవం విద్యార్థులను పొందేందుకు సహకరించిన సంస్థలకు, స్పాన్సర్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పసుపు పండగ సక్సెస్ : మాట మార్చిన వల్లభనేని వంశీ.. టీడీపీ సూపర్ అంటూ...