Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సైతాను మనల్ని మార్చడానికి ఎప్పుడు మన వెంటే ఉంటుంది

మనుష్యజాతి నిర్మించడానికి దేవుడు అద్భుతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన సొంత పోలికతో మనల్ని సృజించాడు. దీని భావం అదివరకే దేవునికి భౌతిక శరీరం ఉందనికాదు. మనుష్యుడు ఆత్మీయంగా సజీయుడైన వ్యక్తిగా సృష్టింపబడ్డాడు. నరునితో సంభాషిస్తూ

సైతాను మనల్ని మార్చడానికి ఎప్పుడు మన వెంటే ఉంటుంది
, బుధవారం, 20 డిశెంబరు 2017 (21:23 IST)
మనుష్యజాతి నిర్మించడానికి దేవుడు అద్భుతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన సొంత  పోలికతో మనల్ని సృజించాడు. దీని భావం అదివరకే దేవునికి భౌతిక శరీరం ఉందనికాదు. మనుష్యుడు ఆత్మీయంగా సజీయుడైన వ్యక్తిగా సృష్టింపబడ్డాడు. నరునితో సంభాషిస్తూ సహవాసం చెయ్యాలని దేవుడు అలాగ చేసి ఉన్నాడు. నరుని పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమను యింకా ఈ రీతిలో దేవుడు వ్యక్తం చేశాడు. అనుదినాహారం కొరకు ఏర్పాటు చేసాడు. ఒక ప్రత్యేకమైన వనం సిద్ధపరచి అతనికి ఆనందం, వ్యాపకం ఏర్పాట్లు చేశాడు. చక్కని సహచరి అనగా భార్యను అనుగ్రహించాడు.
 
మనుష్యుడు ఎన్నడూ చనిపోకుండా ఉండాలని నిరంతరాయంగా జీవమును కొనసాగించే జీవవృక్షాన్ని కూడా అనుగ్రహించాడు. ఇవన్నీ మానవుల పట్ల సృష్టికర్తకు ఉండిన మహాప్రేమ యొక్క ఋజువులే. ఆయన పవిత్ర ప్రేమకు ఉన్నతమైనా తార్కణంగా మంచిచెడ్డల తెలివినిచ్చే చెట్టును కూడా ఆ వనంలో నాటించాడు. పవిత్ర ప్రేమ పవిత్రమైన ప్రేమనే కోరుకుంటుంది. ఇందులోనే మనుష్యుడు తన సృష్టికర్త యొక్క ప్రేమ అందును జ్ఞానమందును నమ్మకం కలిగియున్నాడో లేదో ఋజువగుతుంది. దేవుడు కరుణతో ఒకే ఒక చెట్టు ఫలాన్ని నిషేధించి దానిని తిను దినమున మరణిస్తావని వివరంగా చెప్పాడు.
 
ఆ చిన్న ఆజ్ఞను తిరస్కరించకుండా ఉండేటట్లుగానే దేవుడు మనుష్యుని నిర్మించాడు. ఆదాము ఆ చిన్న ఆజ్ఞను పాటించలేనంత బలహీనుడేమి కాదు విచారించదగిన విషయమేమిటంటే మరొక ఆత్మ ఉన్నాడు. అతను దేవునికి శత్రువు, దుష్టుడైన వ్యక్తి. ఇతనను మనం సాతాను అని పిలుస్తాము. ఇతనిని కూడా దేవుడే సృష్టించినాడు మంచి మనుస్సుతో దేవుడు ఇతనను సృష్టించినా కాని ఈ సాతాను దేవుడుకి సమానంగా ఉండాలనే తలంపుతో దేవునికి శత్రువుగా మిగిలిపోయాడు. ఆ సైతాను మనల్ని మార్చడానికి ఎప్పుడు మన వెంటే ఉంటుంది. దీని నుండి మనల్ని మనం రక్షించుకోవాలి అంటే మనం దేవుని బిడ్డలగా ఉండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డిసెంబర్ 21, 2017: ఏ పనులు ప్రారంభించొద్దు.. #UnluckyDay (video)