Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

81 ఏళ్లలో ఆ నన్‌కు మానవ సేవే పరమావిధి: పోప్ ఫ్రాన్సిస్‌ ఆప్యాయంగా..

81 ఏళ్లలో ఆ నన్‌కు మానవ సేవే పరమావిధి: పోప్ ఫ్రాన్సిస్‌ ఆప్యాయంగా..
, శుక్రవారం, 3 జులై 2015 (19:10 IST)
సుమారు 34వేల మంది గర్భవతులకు ప్రసవం చేసిన నన్ పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశారు. ఇటలీకి చెందిన మేరియా కాన్ కెట్టా (81) నన్‌గా ఆఫ్రికాలోని దీఆర్ కాంగోలో గత 50 ఏళ్ల నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈమె పోప్ ఫ్రాన్సిన్‌ కలిసిన నేపథ్యంలో తన చేతులను స్పృశించాలని కోరారు. అలా చేయడం ద్వారా 34వేల మంది పిల్లలను ఆశీర్వదించినట్లవుతుందని విజ్ఞప్తి చేశారు. 
 
నిరాడంబరతకు పెద్దపీట వేసే పోప్ ఫ్రాన్సిస్, అంత గొప్ప పని చేసిన ఆమె చేతులను ఆప్యాయంగా తాకారట. ఎనిమిది పదుల వయసు దాటినా ఆమె ఇప్పటికీ విధుల్లో పాలుపంచుకోవడం విశేషం. మదర్ థెరెస్సా కూడా ఇలాంటి నన్ గానే భారత్‌లో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే.. రోమన్ క్యాథలిక్కుల్లో నన్‌ల సేవలు ప్రత్యేకమైనవి. వీరు దైవ ప్రచారం కంటే మానవ సేవనే పరమావిధిగా విధులు నిర్వర్తిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu