Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోబీ బట్టర్ మసాలా గ్రేవీ ఎలా చేయాలి?

గోబీ బట్టర్ మసాలా గ్రేవీ ఎలా చేయాలి?
, సోమవారం, 4 మే 2015 (19:09 IST)
క్యాలీఫ్లవర్‌లో విటమిన్‌ సి పుష్కలంగా ఉంది. ఇన్ఫెక్షన్లకు, క్యాన్సర్‌కు చెక్ పెట్టే గోబీలో విటమిమ్ బి కాంప్లెక్, విటమిన్ బి5, బీ6, బీ1, కెలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్యాలీఫ్లవర్‌తో గోబీ బట్టర్ మసాలా ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం.. పిల్లలు ఇష్టపడి తినే ఈ గోబి బట్టర్ మసాలా ఎలా చేయాలంటే.. 
 
కావల్సిన పదార్థాలు: 
వెన్న: ఒక కప్పు
మసాలాలు: ఏలకలు, దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకులను అర కప్పు
ఉల్లిపాయ తరుగు: ఒక కప్పు 
జీడిపప్పు: ఒక కప్పు 
అల్లం వెల్లుల్లి  పేస్ట్ : ఒక టేబుల్ స్పూన్ 
ఉప్పు : తగినంత 
పచ్చిమిర్చి: రుచికి తగినంత 
ఎండుమిర్చి: రుచికి తగినంత
టొమాటో తరుగు: రెండు కప్పులు 
పంచదార : ఒక టీ స్పూన్ 
కార్న్ ఫ్లోర్ : ఒక టీ స్పూన్ 
ధనియాల పొడి: ఒక టీ స్పూన్ 
రుచికి సరిపడా ఫ్రెష్ క్రీమ్ 
 
తయారీ విధానం : 
ముందుగా కుక్కర్లో కొద్దిగా బటర్ వేసి వేడి చేయాలి ఇందులో మసాలాలు వేసి ఉల్లి ముక్కలు జీడిపప్పు వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్‌‍లోకి మారే వరకూ ఫ్రై చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి ఫ్రై చేయాలి. అందులోనే పచ్చిమిర్చి, ఎండు మిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమోటో ముక్కలు వేసి మిక్స్ చేసి మూత మూసేయాలి. 
 
మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం ఉడికిన తర్వాత మూత తీసి, మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను బ్లౌల్లోకి మార్చుకొని, ఉడికించాలి. దీనికి కొద్దిగా పంచదార మిక్స్ చేసి, తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా కార్న్ ఫ్లోర్, మైదా, పెప్పర్ పొడి, ధనియాలపొడి, ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి. 
 
ఈ పేస్ట్‌ను గోబీ (చిన్న చిన్నవిగా విడిపించి, శుభ్రం చేసిన కాలీఫ్లవర్)కు అప్లై చేయాలి. ఇలా మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్‌లో మిక్సీలో గ్రైడ్ చేసి పెట్టుకొన్న పేస్ట్.. కొద్దిగా బట్టర్ వేసి ఉడికించుకోవాలి. 5నిముషాల తర్వాత మసాలా దంటించి పెట్టుకొన్న గోబిని అందులో వేసి మూత పెట్టాలి. ఇలా చేసిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా మిక్స్ చేసి వేడిగా సర్వ్ చేయాలి. అంతే గోబి బట్టర్ మసాలా రెడీ.. 

Share this Story:

Follow Webdunia telugu