Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంట్లోనే ఐస్ టీని ట్రై చేయండి!

ఇంట్లోనే ఐస్ టీని ట్రై చేయండి!
, మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (17:52 IST)
ఐస్ టీ అలసి, సొలసినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఉత్తేజపరుస్తుంది. ఐస్ టీలో రిచ్ విటమిన్స్, మినరల్స్, యాంటీ-యాక్సిడెంట్లు, లో క్యాలరీలు ఉంటాయి. ఇంకా ఐస్ టీ క్యావిటీస్‌ను నియంత్రిస్తుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఈ టీని ఇంట్లోనే ట్రై చేయాలంటే.. 
 
ఐస్ టీకి కావాల్సినవి:
4 టీ బాగ్స్, టీ స్పూన్ల మంచి టీ పొడి, 
3 కప్పుల మరిగే నీరు, 
తగినంత షుగర్, 
2-3 లెమన్స్ జ్యూస్ 
ఐస్ క్యూబ్స్ 
 
తయారీ విధానం : గ్లాస్‌జగ్‌లో టీ బాగ్స్ ఉంచాలి. దానిపై మరిగే నీరు పొయ్యాలి. తగినంత పంచదార కలపాలి. కావలసిన చిక్కదనం బట్టి 5-8నిమిషాల తర్వాత టీ బాగ్స్ తీసేయాలి. లెమన్ జ్యూస్ దానికి కలిపి బాగా కలియబెట్టాలి. గ్లాసులతో కావలసినంత ఐస్ క్యూబ్స్ వేసి దానికి టీ కలపాలి. లెమన్ జ్యూస్ తగినంతగా కలుపుకోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu