Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అప్పడాలు డబ్బాలో బియ్యం వేసుకుంటే?

కోడిగుడ్లు ఉడికేటప్పుడు పగలకుండా ఉండాలంటే కొద్దిగా ఉప్పును వేసి ఉడకించుకోవాలి. కుక్కుర్ ఏదైనా చేసుకునేటప్పుడు అందులో చింతపండును వేసుకుంటే కుక్కర్ నల్లగా మారదు. మటన్ బిర్యానీ చేసుకునేటప్పుడు మటన్ త్వరగ

అప్పడాలు డబ్బాలో బియ్యం వేసుకుంటే?
, మంగళవారం, 31 జులై 2018 (16:25 IST)
కోడిగుడ్లు ఉడికేటప్పుడు పగలకుండా ఉండాలంటే కొద్దిగా ఉప్పును వేసి ఉడకించుకోవాలి. కుక్కుర్ ఏదైనా చేసుకునేటప్పుడు అందులో చింతపండును వేసుకుంటే కుక్కర్ నల్లగా మారదు. మటన్ బిర్యానీ చేసుకునేటప్పుడు మటన్ త్వరగా ఉడకాలంటే అందులో పచ్చి బొప్పాయి ముక్కును వేసుకోవాలి. అల్లం వెల్లులి పేస్ట్ ఎక్కువ రోజులు ఉండాలంటే అందులో కొద్దిగా ఉప్పు, పసుపును కలిపి పెట్టుకోవాలి.
 
బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు ఎండు మిరపకాయలు వేసుకుంటే బియ్యం పురుగులు పట్టవు. అరటికాయ ముక్కలను కాసేపు మజ్జిగలో వేసుకుని వేయిస్తే త్వరగా వేగుతాయి. ఇడ్లీ పిండి మరుసరోజుకు పులవకుండా ఉండాలంటే ఆ గిన్నేమీద తడి వస్త్రం లేదా సోడా ఉప్పు వెయ్యాలి. వెన్న కాచేటప్పుడు అందులో తమలపాకులు వేసుకుంటే నెయ్యి ఎక్కువ రోజులు నిల్వఉంటుంది.
 
వెల్లుల్లిని ఫ్రిజ్‌లో ఉంచుకుంటే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. యాపిల్ ముక్కల మీద నిమ్మరసాన్ని రాసుకుంటే అవి రంగు మారవు. పచ్చిమిర్చికి గాట్లు పెడితే వాటిని వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయి. పెసర పిండిలో నిమ్మరసాన్ని కలుకుని వెండి సామాగ్రిని కడుక్కుంటే కొత్తవాటిలా మెరిసిపోతాయి. అప్పడాలు డబ్బాలో బియ్యం లేదా సెనగపప్పు వేస్తే అవి మెత్త బడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నల్లతులసి రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే?