Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జయహో... 10+10 టెండూల్కర్!!

జయహో... 10+10 టెండూల్కర్!!
File
FILE
అతడక్రికెట్ విఫణిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని, తనదంటూ ఓ ప్రత్యేక శైలితో వివాదాలకు దూరంగా మచ్చలేని చంద్రునిలా నిలిచిపోయాడు. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ తర్వాత అంతటి క్రికెటర్ అంటూ ప్రశంసలు అందుకున్నా, కెప్టన్‌గా విమర్శలు ఎదుర్కొన్నా, అన్నింటినీ అనుభవ పాఠాలుగా మలుచుకుంటూ ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తుకు ఎదిగాడతను. అతనే 'మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్'.

ఇప్పటి యువక్రికెటర్లందరికీ అతను ఆరాధ్య దైవం. అభిమానులకు క్రికెట్ భగవంతుడు. మాస్టర్ సచిన్‌గా క్రీజులో అడుగుపెట్టిన టెండూల్కర్ క్రికెట్ రంగ ప్రవేశం చేసి 20 ఏళ్లు. అయినా సచిన్ ఎప్పటిలా నిత్య విద్యార్థిలా ప్రతి అంశాన్ని అవలోకనం చేసుకునేందుకు ఉబలాటపడటం.. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది అభిమానులను సంపాదించిపెట్టింది.

అందుకే క్రికెట్ పండితులు, సీనియర్ల సైతం సచిన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని యువ క్రికెటర్లకు సూచనలు చేస్తుంటారు. ప్రస్తుతం సచిన్ క్రికెట్ కెరీర్ ప్రారంభమై నవంబర్ 15వ తేదీ నాటికి 20 ఏళ్లు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా ఆయన కెరీర్‌ ప్రస్థానం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

1989లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా సచిన్ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. తొలి టెస్టులోనే వరుస సిక్సర్లు బాది ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. అలా ప్రారంభమైన స'చినుడి' ప్రస్థానం.. ఇంతటి స్థాయికి చేరుకుంటుందని ఆనాడు ఎవరూ ఊహించలేదు.

1989 నుంచే సచిన్ విజయ విహారం ప్రారంభమైంది. 1990లో ఇంగ్లండ్‌పై సెంచరీతో చెలరేగి భారత్‌ను విజయపథంలో నడిపించాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లపై 1992, 1993 సీజన్‌లలో జరిగిన మ్యాచ్‌ల్లో భారత్ వరుసగా వికెట్లు కోల్పోతున్నా సచిన్ మాత్రం ఎదురొడ్డి పోరాడాడు. ఇందులో సచిన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన భారత్‌కు విజయాన్ని సాధించి పెట్టింది.

1995లో శ్రీలంకతతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ తొలిసారిగా విశ్వరూపం ప్రదర్శించాడు. దీంతో అప్పటి నుంచి ప్రత్యర్థి జట్లు సచిన్‌ను ఓ ప్రమాదకర బ్యాట్సమన్‌గా పరగణించడం మొదలు పెట్టాయి. ఏదేశమైనా భారత్‌తో మ్యాచ్ అంటే ముందుగా సచిన్ వికెట్‌పైనే ఎక్కువగా దృష్టి పెట్టడం మొదలు పెట్టాయి.

1999లో ప్రపంచకప్ సమయంలో సచిన్ తండ్రి రమేష్ టెండూల్కర్ మృతి చెందారు. అప్పుడు భారత్ జట్టు కెన్యాతో ఆడుతోంది. సచిన్ సెంచరీ సాధించి దానిని తన తండ్రికి అంకితమిచ్చాడు. అలా ఆ తర్వాత 2000, 2001లలో దక్షిణాఫ్రికాపై, 2002లో ఇంగ్లండ్, 2003 పాకిస్తాన్, 2004 ఆసీస్, 2005 శ్రీలంక, 2006 పాకిస్థాన్, 2007, 2008లలో ఇంగ్లండ్‌పై సచిన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు.

ఇక ఇటీవల నవంబర్ 5న ఆసీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికీ సచిన్ ఇన్నింగ్స్ భారత్‌ను గెలుపు తీరాలకు చేర్చినంత పనిచేసింది. ఈ మ్యాచ్‌లోనే సచిన్ వన్డేల్లో 17వేల పరుగుల మైలురాయిని దాటి రికార్డు సృష్టించాడు. సచిన్ 175 పరుగులతో విరుచుకుపడినప్పటికీ మిగతా బ్యాట్స్‌మన్‌ల విఫలంతో భారత్ పరాజయం పాలైంది.

ఈ విధంగా సచిన్ తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన సచిన్ ఒక కెప్టెన్‌గా మాత్రం విజయం సాధించలేకపోయాడన్నది అందరికీ తెలిసిన విషయమే. బ్యాట్స్‌మన్‌గా ఆయనకు ఎవరూ సాటిరాకపోయినా అతడిలా రికార్డులు సృష్టించలేకపోయినా ఒక్క కెప్టెన్‌గా సచిన్‌ సఫలమవలేకపోయారు.

సీనియర్ క్రికెటర్ శివలాల్ యాదవ్ మాట్లాడుతూ, సచిన్ ఆలోచనా విధానం విభిన్నంగా ఉంటుందని, తనలా జట్టులోని ఆటగాళ్లు కూడా ఆడాలని కోరుకునే మనస్తత్వం ఉన్నవాడని అన్నారు.

కారణాలేవైనప్పటికీ.. 1990 సీజన్‌లో సెంచరీ కొడితే గానీ తిరిగి రాడు అనేంత అద్భుత ఫామ్‌లో ఉన్న తరుణంలో అప్పటి కెప్టెన్ అజారుద్దీన్ వైదొలగడంతో ఆ బాధ్యతలు సచిన్ తీసుకోవలసి వచ్చింది. 1996లో సచిన్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు.

భారత క్రికెట్ కెప్టెన్‌గా విఫలమైతేనేం భారత జట్టులో ఆటగాడిగా ఉండటం తనకు ఎంతో గౌరవమని సచిన్ వ్యాఖ్యానించడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. తన దృష్టంతా 2011లో జరిగే ప్రపంచకప్ టైటిల్‌పైనే ఉన్నదని సచిన్ అంటాడు. తన ప్రస్థానంలో భారత్‌కు ఒక ప్రపంచకప్ తీసుకురావాలన్నదే సచిన్ కోరిక. సచిన్ కోరిక నెరవేరాలని ఆకాంక్షిద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ సచిన్.

Share this Story:

Follow Webdunia telugu