Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సచిన్ టెండూల్కర్ ఢిపరెంట్ బ్యాట్స్‌మెన్ ఎందుకో తెలుసా!?

సచిన్ టెండూల్కర్ ఢిపరెంట్ బ్యాట్స్‌మెన్ ఎందుకో తెలుసా!?
FILE
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌.. తన కెరీర్ ముగిసేలోపు దేశానికి వన్డే ప్రపంచకప్‌ ట్రోఫీని అందివ్వాలని యావత్ క్రికెట్ ప్రపంచం ఆకాంక్షిస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు సచిన్ గాయంతో దూరమైనప్పటికీ, కేప్‌టౌన్ టెస్టులో అద్భుత ఇన్నింగ్స్‌తో సెంచరీతో అదరగొట్టాడు.

సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ బ్యాట్స్‌మెన్ 20 లేక 22 ఏళ్లలో అడుగుపెడతాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన 8 లేదా పదేళ్లలో ఓ క్రికెటర్ అద్భుతమైన ఆటతీరుతో రాణించగలడు. కానీ సచిన్‌ మాత్రం డిఫరెంట్ బ్యాట్స్‌మెన్. మూడు పదుల వయసైనా తనదైన శైలిలో క్రీజులో నిలదొక్కుకుని ఆడే సూపర్ బ్యాట్స్‌మన్.

దక్షిణాఫ్రికాతో ముగిసిన టెస్టు సిరీస్‌లో డేల్ స్టెయిన్, మోర్కెల్‌ల పదునైన బౌలింగ్‌కు సచిన్ ఎలాంటి ఒత్తిడికిలోనుకాకుండా ఆడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రతీసారి తన బ్యాటింగ్‌పై వచ్చిన విమర్శలకు సచిన్ తన బ్యాట్‌తోనే సమాధానమిస్తున్నాడు.

దక్షిణాఫ్రికా ముగిసిన తర్వాత 2010వ సంవత్సరం అత్యుత్తమ క్రికెట్ జట్టులో సచిన్‌కు సముచిత స్థానం ఇచ్చిన ఇయాన్ ఛాపెల్ సచిన్ తన పాతదైన బ్యాటింగ్ శైలిలో కొత్త కళను కనిపెట్టాడని కితాబివ్వడం విశేషం. ఇదే ఛాపెల్ కొన్నేళ్ల క్రితం సచిన్ టెండూల్కర్ తనను తానే అద్దంలో చూసుకునే, అద్దంతో తాను ఆడాలా వద్దా అని అడగాలని ఇయాన్ ఛాపెల్ తీవ్రతరమైన వ్యాఖ్యలు చేశాడు. అందుకే సచినో డిఫరెంట్ బ్యాట్స్‌మెన్ అని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

తనపై విమర్శలు గుప్పించే వారికి బ్యాట్‌తో సమాధానమిచ్చే సచిన్ టెండూల్కర్, సొంతగడ్డపై జరుగనున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌లో రాణించి కప్ గెలుచుకోవాలని కలలు కంటున్నాడు.

ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న భారత్ ఈ వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకోవాలని, తద్వారా మాస్టర్ ఖాతాలో చేరని వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ఆయనకు కానుకగా అందజేయాలని అటు టీమిండియా సభ్యులు, సన్నిహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులే కాకుండా భారత దేశ ప్రజలు సైతం ఆకాంక్షిస్తున్నారు. ఇంకేముంది.? మాస్టర్ సచిన్ ఈ వన్డే ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌తో రాణించి చరిత్ర సృష్టించాలని మనం కూడా ఆశిద్దాం...!

Share this Story:

Follow Webdunia telugu