Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతి.. టీమిండియాను తక్కువ అంచనా వేయలేం..

సెప్టెంబర్ 15వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఇప్పటికే ఇంగ్లండ్‌ చేతిలో సిరీస్ ఓడిపోయిన టీమిండియా ఆసియా కప్‌లో ఏమేరకు ఆడుతుందోనని క్రికెట్ ఫ్యాన్స్ మధ్య అంచనాలున్నాయి.

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (17:15 IST)
సెప్టెంబర్ 15వ తేదీ నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఇప్పటికే ఇంగ్లండ్‌ చేతిలో సిరీస్ ఓడిపోయిన టీమిండియా ఆసియా కప్‌లో ఏమేరకు ఆడుతుందోనని క్రికెట్ ఫ్యాన్స్ మధ్య అంచనాలున్నాయి. 
 
అయితే విరావం లేకుండా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో బీసీసీఐ సెలెక్టర్లు కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. ఫలితంగా టీమిండియా జట్టు ధీటుగా ఆడుతుందా లేదా అనే అనుమానం ఏర్పడింది. కానీ కోహ్లీ లేకపోయినా సరే.. భారత జట్టును తక్కువగా అంచనా వేయలేమని పాకిస్థాన్ క్రికెటర్ ఫకార్ జమాన్ అంటున్నాడు. 
 
ఆసియా కప్‌లో పాల్గొనే టీమిండియా గురించి ఫకార్‌ జమాన్‌ మాట్లాడుతూ… ప్రపంచంలోని మేటి క్రికెట్ జట్లలో భారత జట్టు ఒకటన్నాడు. భారత జట్టులో కోహ్లీ లేకున్నా పెద్ద తేడా వుండదన్నాడు. కాబట్టి ఆసియా కప్‌ టోర్నీ ఆసక్తికరంగా సాగడం ఖాయమని జమాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. 
 
పాకిస్థాన్ తరపున ఏ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడినా ఆటగాళ్లపై చాలా ఒత్తిడి ఉంటుంది. అదే భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ అంటే ఆ ఒత్తిడి ఇంకా ఎక్కువని జమాన్ గుర్తు చేశాడు. అలాంటి అనుభవం తనకు ఇప్పటికే ఎదురైందని చెప్పాడు.

సంబంధిత వార్తలు

కాంగ్రెస్ గూటికి హైదరాబాద్ మేయర్.. కేకే కూడా అదే బాటలో..

వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నా.. కడియం కావ్య

అరుణాచల్‌పై నోరు పారేసుకున్న డ్రాగన్ కంట్రీ.. భారత్ ఏమందంటే?

'వారాహి విజయభేరి' మార్చి 30 నుంచి ప్రారంభం

ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే "ఆడబిడ్డ" నిధి ఇస్తాం.. చంద్రబాబు

టాక్సిక్ కోసం పనిచేస్తున్న యష్.. ఫోటోలు వీడియోలు వైరల్

ఫైటర్ రాజా టీజర్ ఇంపాక్ట్ ఫుల్ గా వుంది : విశ్వక్ సేన్

అల్లు అర్జున్ 21 సంవత్సరాల జర్నీ, దుబాయ్‌లో తన మైనపు విగ్రహం

ఔను.... ఆమె ఎస్ చెప్పింది.. ఎంగేజ్డ్: హీరో సిద్ధార్థ్

లిప్ లాక్, ఎక్స్‌పోజింగ్ నచ్చదు, నటనకు ప్రాధాన్యం ఇస్తా : ఆయుషి పటేల్

తర్వాతి కథనం
Show comments