Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐసీసీ వరల్డ్ వన్డే కప్‌లోనే కాదు.. అండర్-19 ప్రపంచ కప్‌లోనూ సేమ్ సీన్ రిపీట్!!

australiaunder-19

ఠాగూర్

, సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (11:21 IST)
గత యేడాది జరిగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ ఆఖరి మ్యాచ్‌లో భారత జట్టు సమిష్టిగా ఓడిపోయింది. భారత గడ్డపై జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో పరాజయంపాలైంది. ఇపుడు ఆస్ట్రేలియా గడ్డపై సేమ్ సీన్ రిపీట్ అయింది. అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టులో భారత కుర్రాళ్లు ఓడిపోయారు. ఒత్తిడిని జయించలేక చేతులెత్తేశారు. మొత్తం 254 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి అండర్-19 కుర్రాళ్లు 43.5 ఓవర్లలో 174 పరుగులకే చాపచుట్టేశారు. ఫలితంగా అండర్-19 ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియా కుర్రాళ్లకు అప్పగించారు. 
 
బెనోనీ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్ కుర్రాళ్ల జట్టు 79 పరుగుల తేడాతో ఓడిపోయారు. లక్ష్యం పెద్దదేమీ కానప్పటికీ, కుర్రాళ్లు ఒత్తిడికి లోనై వికెట్లు అప్పగించేశారు. 254 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూలింది. ఆదర్శ్ సింగ్ 47, హైదరాబాద్ ఆటగాడు మురుగన్ అభిషేక్ 42, ముషీర్ ఖాన్ 22 పరుగులతో ఫర్వాలేదనిపించారు. టోర్నీలో పరుగుల వర్షం కురిపించిన కెప్టెన్ ఉదయ్ సహారన్ (8), సచిన్ దాస్ (9), అర్షిన్ కులకర్ణి (3) కీలకమైన ఫైనల్లో విఫలం కావడం జట్టు అవకాశాలపై తీవ్ర ప్రభావం పింది.
 
ప్రియాన్షు మోలియా 9 పరుగులు చేయగా, హైదరాబాద్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆరవెల్లి అవనీశ్ రావు (0) డకౌట్ అయ్యాడు. ఆసీస్ బౌలర్లలో మాలీ బియర్డ్ మాన్ 3, రాఫ్ మెక్ మిలన్ 3, కల్లమ్ విల్డర్ 2, చార్లీ ఆండర్సన్ 1, టామ్ స్ట్రాకర్ 1 వికెట్ తీశారు. ఇప్పటికే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ చాంపియన్స్, టెస్ట్ చాంపియన్ షిప్ విజేత, మహిళల వన్డే, మహిళల టీ20 వరల్డ్ కప్ ల విజేతగా ఉన్న ఆస్ట్రేలియా ఖాతాలో ఇప్పుడు అండర్-19 వరల్డ్ కప్ కూడా చేరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డేవిడ్ వార్నర్ మరో అరుదైన రికార్డు- వరల్డ్ కప్ తర్వాత వద్దే వద్దు