Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక్క బంతి పడకుండానే సౌతాఫ్రికాతో తొలి టీ20 వర్షార్పణం

durban cricket stadium
, సోమవారం, 11 డిశెంబరు 2023 (09:15 IST)
భారత క్రికెట్ జట్టు సౌతాఫ్రికాలో క్రికెట్ సిరీస్ కోసం పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా, డిసెంబరు పదో తేదీ ఆదివారం తొలి టీ20 మ్యాచ్ జరగాల్సివుంది. అయితే, వరుణ దేవుడు ఏమాత్రం కనికరించకపోవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే తొలి టీ20 రద్దు అయింది. 
 
ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమిచ్చిన డర్బన్‌లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ఫీల్డ్ అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. డర్బన్‌లోని కింగ్స్ మీడ్ స్టేడియం వర్షం కారణంగా తడిసిముద్దయింది. దీంతో కనీసం టాస్ కూడా వేయలేకపోయారు. వర్షం తగ్గితే ఓవర్లు తగ్గించయినా మ్యాచ్‌ను నిర్వహించాలని భావించారు. అదీకూడా సాధ్యంకాకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇకపోతే, రెండో టీ20 మ్యాచ్ ఇరు జట్ల మధ్య ఈ నెల 12వ తేదీన కెబెరాలో జరుగనుంది. 
 
మరోవైపు, భారత క్రికెట్ జట్టుపై క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మొదటి టీ20 మ్యాచ్‌కి ముందు టీమిండియా ఓపెనింగ్ కాంబినేషన్‌పై ప్రశ్నించగా ఆసక్తికరంగా స్పందించాడు. ఈ సిరీస్ విషయానికి వస్తే శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గ్వైక్వాడ్‌తో పాటు యశస్వి జైస్వాల్ కూడా రేసులో ఉన్నాడు. 
 
జైస్వాల్ కూడా బాగానే రాణించాడు. జట్టుకు ఎడమ చేతి, కుడిచేతి కాంబినేషన్ అవసరమని భావిస్తే శుభమాన్ గిల్, యశశ్వి జైస్వాల్ ఉత్తమ జోడీ అని గవాస్కర్ అన్నాడు. ఓపెనింగ్ కాంబినేషన్ టీమిండియాకు చాలా మంచి సమస్య అని వ్యాఖ్యానించాడు. రోహిత్ శర్మ కూడా వేచి ఉన్నాడని, టీ20 వరల్డ్ కప్‌కు అందుబాటులో ఉంటాడో లేదో వేచిచూడాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సౌతాఫ్రికా పర్యటనలో భారత్ - నేటి నుంచి డర్బన్ తొలి టీ20 మ్యాచ్