Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేప్‌‍టౌన్ టెస్ట్ మ్యాచ్ : 7 వికెట్ల తేడాతో భారత్ విజయం

rohit sharma

ఠాగూర్

, గురువారం, 4 జనవరి 2024 (17:21 IST)
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించింది. 79 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 12 ఓవర్లలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ తరఫున జైశ్వాల్ 28, రోహిత్ శర్మ 17, విరాట్ కోహ్లీ 12 పరుగులు చేశారు. ఈ విజయంతో 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది.
 
కేప్ టౌన్‌లో వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా టీమిండియా ముందు 79 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. మామూలు పరిస్థితుల్లో అయితే ఈ లక్ష్యం ఆడుతూ పాడుతూ కొట్టేశారు. కానీ, ఇక్కడి న్యూలాండ్స్ స్టేడియం పిచ్ పేసర్లకు వికెట్ల పంట పండిస్తోంది. దాంతో, టీమిండియా ఈ లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 
 
కాగా, ఓవర్ నైట్ స్కోరు 63/3 తో నేడు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 36.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌట్ అయింది. మిగతా బ్యాటర్లు నిప్పుల కుంపటిలా భావించిన ఈ పిచ్‌పై సఫారీ ఓపెనర్ ఐడెన్ మార్‌క్రమ్ సెంచరీ సాధించడం వేరే లెవెల్ ఆట అని చెప్పవచ్చు. వీరోచితంగా ఆడిన మార్‌క్రమ్ 103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 106 పరుగులు చేసి ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
 
ఓవైపు వికెట్లు రాలిపోతున్నా, మార్‌క్రమ్ ఒంటరిపోరాటం చేశాడు. అతడి వల్లే దక్షిణాఫ్రికా జట్టు టీమిండియాకు లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. లేకపోతే, టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. టీమిండియా బౌలర్లలో బుమ్రా అద్భుతంగా రాణించి 6 వికెట్లు పడగొట్టడం ఇవాళి ఆటలో మరో హైలైట్. ముఖేశ్ కుమార్ కు 2, ప్రసిద్ధ కృష్ణకు 1, సిరాజ్ కు 1 వికెట్ లభించాయి. ఈ టెస్టుకు ఇవాళ రెండో రోజు కాగా... కాసేపట్లో ఫలితం తేలే అవకాశాలున్నాయి. ఈ టెస్టులో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం, టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 153 పరుగులు చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దక్షిణాఫ్రికా-భారత్ రెండో టెస్టు.. మహ్మద్ సిరాజ్ ఆరు వికెట్లతో అదుర్స్