Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత జట్టు సభ్యుడిగా ఆటో డ్రైవర్ కుమారుడు...

భారత క్రికెట్ జట్టు సభ్యుడిగా ఓ ఆటో డ్రైవర్ కుమారుడు చోటు దక్కించుకున్నాడు. ఆ ఆటగాడి పేరు మొహ్మద్ సిరాజ్. న్యూజిలాండ్‌తో నవంబర్‌ 1న మొదలయ్యే టీ-20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన 16 మంది సభ్యుల బృందంలో 23 ఏళ

భారత జట్టు సభ్యుడిగా ఆటో డ్రైవర్ కుమారుడు...
, మంగళవారం, 24 అక్టోబరు 2017 (10:49 IST)
భారత క్రికెట్ జట్టు సభ్యుడిగా ఓ ఆటో డ్రైవర్ కుమారుడు చోటు దక్కించుకున్నాడు. ఆ ఆటగాడి పేరు మొహ్మద్ సిరాజ్. న్యూజిలాండ్‌తో నవంబర్‌ 1న మొదలయ్యే టీ-20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన 16 మంది సభ్యుల బృందంలో 23 ఏళ్ల సిరాజ్‌ ఉన్నాడు. సిరాజ్‌తోపాటు యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ కూడా జట్టులోకి తీసుకున్నాడు. ఈ ఇద్దరూ టీ20లకు ఎంపికవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గతంలో అయ్యర్‌ టెస్టులకు ఎంపికైనా.. తుది జట్టులో చోటుదక్కలేదు. 
 
దీనిపై సిరాజ్ మాట్లాడుతూ, భవిష్యత్తులో ఏదో ఒకరోజు టీమిండియా తరపున ఆడే అవకాశం వస్తుందని కలలుగన్నా. కానీ అది ఇంత త్వరగా నెరవేరుతుందనుకోలేదు. నా సంతోషాన్ని మాటల్లో వ్యక్తం చేయలేను. నా తల్లిదండ్రులకయితే నోట మాట రాలేదు. నా స్వప్నం సాకారమైందని సిరాజ్‌ ఎంతో ఆనందంగా చెప్పాడు. 
 
ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఆటో డ్రైవర్‌ కొడుకు సిరాజ్‌ను రూ.2.6 కోట్లకు కొనుగోలు చేయడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత భారత్‌-ఎ టీమ్‌లో చోటు దక్కించుకున్న సిరాజ్‌.. నిలకడైన ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. 'ఐపీఎల్‌లో భారీ ధరకు అమ్ముడైనప్పుడు నా కోరిక ఒక్కటే. ఆటో డ్రైవర్‌ అయిన తండ్రికి విశ్రాంతి నివ్వాలి. నా మాట నిలబెట్టుకున్నాను. కొత్త ఇంట్లోకి మారాన'ని సిరాజ్‌ చెప్పాడు. 23 ఏళ్ల వయసులో కుటుంబానికి అండగా నిలిచినందుకు ఎంతో గర్వపడుతున్నట్టు చెప్పాడు. 
 
రంజీల్లో ప్రదర్శన కారణంగానే నేనీ స్థితిలో ఉన్నా. గత సీజన్‌లో 40 వికెట్లు తీయడం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ కారణంగానే ఐపీఎల్‌ అవకాశం వచ్చిందని చెప్పాడు. గత యేడాది హైదరాబాద్‌ రంజీ కోచ్‌గా ఉన్న భరత్‌ అరుణ్‌ సూచనల కారణంగా తన బౌలింగ్‌ ఎంతో మెరుగుపడిందని సిరాజ్‌ అన్నాడు. అంతేకాకుండా ఐపీఎల్‌ సహచరులు భువీ, నెహ్రా ప్రోత్సహించారని చెప్పుకొచ్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేయసిని పెళ్లాడనున్న విరాట్ కోహ్లీ...