Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధోనీ నాశనం కోరుకుంటావా లక్ష్మణ్? రవిశాస్త్రి ఫైర్, ఏంటబ్బా?

సహజమే. కెప్టెన్‌గా వున్నప్పుడు ఒకలా జట్టు సభ్యుడిగా మారిపోతే ఇంకోలా. నాలుకే కదా ఎలాబడితే అలా తిరిపోతుంది. ఎవరిష్టం వచ్చినట్లు వారు పేలుతారు. ధోనీ ఇవన్నీ తట్టుకుని జట్టులో సాగుతున్నాడు మరి. ఇదిలావుంటే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని లెజెండ్‌ క

ధోనీ నాశనం కోరుకుంటావా లక్ష్మణ్? రవిశాస్త్రి ఫైర్, ఏంటబ్బా?
, శుక్రవారం, 10 నవంబరు 2017 (16:00 IST)
సహజమే. కెప్టెన్‌గా వున్నప్పుడు ఒకలా జట్టు సభ్యుడిగా మారిపోతే ఇంకోలా. నాలుకే కదా ఎలాబడితే అలా తిరిపోతుంది. ఎవరిష్టం వచ్చినట్లు వారు పేలుతారు. ధోనీ ఇవన్నీ తట్టుకుని జట్టులో సాగుతున్నాడు మరి. ఇదిలావుంటే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని లెజెండ్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనిపై మాజీ క్రికెటర్లు వివిఎస్ లక్ష్మణ్, అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలపై రవిశాస్త్రి చాలా ఆలస్యంగానైనా స్పందించారు. 
 
ఇప్పటికే ధోనీ వైదొలగాలంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్‌, మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌లు మద్దతు ప్రకటించారు. వీరితోపాటుగా ఇప్పుడు టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కూడా ధోనీపై ప్రశంసలు కురిపిస్తూ ఆయనను వైదొలగాలన్నవారికి చీవాట్లు పెట్టారు.
 
ధోని ఓ దిగ్గజ ఆటగాడనీ, ఆయన ఓ సూపర్ స్టార్ అనీ, గొప్ప నాయకుడనీ ఆకాశానికెత్తేశాడు. ఏదో ఒకటి రెండు ఆటల్లో విఫలమైన ఆయన సగటు రన్ రేట్ ఇప్పటికీ సూపర్‌గా వున్నదంటూ పొగడ్తల జల్లు కురిపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెట్ దిగ్గజం మిల్కా సింగ్ ఇకలేరు...