Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్ఫరాజ్‌కు టెస్ట్ క్యాప్ ప్రజెంటేషన్.. స్టేడియం మొత్తం సైలెంట్.. ఎందుకో తెలుసా?

sarfaraz family

ఠాగూర్

, గురువారం, 15 ఫిబ్రవరి 2024 (12:06 IST)
భారత క్రికెట్ టెస్టు జట్టులోకి 26 యేళ్ల సర్ఫరాజ్‌కు చోటు దక్కించింది. ఆయనకు టెస్ట్ క్యాప్‌ను భారత క్రికెట్ లెజెండ్ అనిల్ కుంబ్లే అందించాడు. దీంతో స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోయింది. దీనికి కారణం లేకపోలేదు. తన కుమారుడు సర్ఫరాజ్‌కు టెస్ట్ క్యాప్ అందించగానే ఆనందంతో తండ్రి నౌషద్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కుమారుడిని ఆలింగనం చేసుకుని క్యాప్‌ను తండ్రి ముద్దాడాడు. అలాగే సర్ఫరాజ్ తల్లి, సర్ఫరాజ్ భార్య కూడా కన్నీటిని ఆపుకోలేక పోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
తన కుమారుడు క్రికెట్ మైదానంలో దిగుతున్నపుడు చూడాలని సర్ఫరాజ్ కుటుంబం ఆరాటపడింది. దీంతో గురువారం నుంచి పర్యాటక ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ మ్యాచ్ కోసం సర్ఫరాజ్ కుటుంబ రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోయేషన్ స్టేడియం వద్దకు చేరుకుంది. ఈ స్టేడియంలో సర్ఫరాజ్‌కు అనిల్ కుంబ్లే టెస్ట్ క్యాప్ అందివ్వగానే ఆనందం పట్టలేక నౌషద్ దంపతులిద్దరూ ఆనంద భాష్పాలు రాల్చారు. క్యాప్ ప్రజెంటేషన్ తర్వాత కుమారుడిని నౌషద్ ఆలింగనం చేసుకుని క్యాప్‌కు ముద్దుపెట్టాడు. ఆ ఆనందంతో కన్నీళ్లు చెక్కిళ్ళపై నుంచి జలజలా రాలాయి.
webdunia
 
సర్ఫరాజ్ భార్య కూడా కన్నీళ్లను ఆపుకోలేక పోయింది. సర్ఫరాజ్ మాత్రం బలవంతంగా కన్నీటిని అదిమిపెట్టుకున్నాడు. ఇది చూసి మైదానం మొత్తం ఉద్విగ్నతకు లోనై, సైలెంట్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇపుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కాగా, సర్ఫరాజ్‌తో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వికెట్ కీప్ ధృవ్ జురెల్ కూడా టెస్ట్ క్యాప్ అందుకున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్ఫరాజ్ అరుదైన రికార్డ్.. రోహిత్ శర్మ అర్థ సెంచరీ.. కష్టాల్లో భారత్