Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ధోనీ వికెట్ కీపర్‌గా వున్నప్పుడు ఏ బ్యాట్స్‌మెనైనా.. క్రీజు దాటాడో..? (Video)

ధోనీ వికెట్ కీపర్‌గా వున్నప్పుడు ఏ బ్యాట్స్‌మెనైనా.. క్రీజు దాటాడో..? (Video)
, మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (18:29 IST)
ధోనీలో ఆ చురుకుదనం సన్నగిల్లలేదు. ఆయన మెరుపు వేగంలో ఏమాత్రం మార్పు రాలేదు. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ వికెట్ కీపింగ్‌పై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. పదేళ్ల క్రితం ధోనీలో వుండిన హుషారు, వేగం అదేలా వుందని ఐసీసీ కూడా కితాబిచ్చింది.


కివీస్‌తో జరిగిన చివరి వన్డేలో భారత జట్టు విజయం ఖాయమైనప్పటికీ.. కివీస్ వీరుడు జేమ్స్ నిశాంత్ బ్యాటింగ్ భారత్ కాస్త జడుసుకుంది. బ్యాటింగ్‌తో జేమ్స్ సత్తా చాటుతుండగా.. భారత్‌కు విజయావకాశాలు సన్నగిల్లాయి. 
 
అలాంటి సందర్భంలో ఆపద్భాంధవుడు అయిన ధోనీ తన సత్తా చాటాడు. ధోనీ రనౌట్‌తోనే భారత జట్టు గెలుపు పథం వైపు దూసుకెళ్లింది. ఈ రనౌట్‌ను చూసిన వారంతా వికెట్ కీపింగ్‌లో ధోనీని అధిగమించేవారు లేరని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధోనీని ప్రశంసిస్తూ.. ఐసీసీ ప్రకటన చేసింది.

ధోనీ వికెట్ కీపర్‌గా వున్నప్పుడు ఏ బ్యాట్స్‌మెనూ.. క్రీజు నుంచి బయటికి రాకుండా వుండాలని తెలిపింది. జేమ్స్ నిశాంత్‌ను ఎల్‌బీడబ్ల్యూ అడుగుతూ.. పక్కాగా రనౌట్ చేయడంపై ఐసీసీ కొనియాడింది. 
 
అలాగే 2009లో కూడా కివీస్ గడ్డపై ఆడుతుండగా.. యువీ బంతిని ధోనీ ఇదే తరహా రనౌట్‌గా మార్చాడు. ప్రస్తుతం పది సంవత్సరాల తర్వాత 2019లోనూ అదే విధంగా రనౌట్ చేయడం స్వాగతించాల్సి విషయమని, అభినందించాల్సిన రనౌట్ అని క్రీడా పండితులు అంటున్నారు. 
 
కివీస్ గడ్డపై 2009లో చేసిన రనౌట్‌కు పది సంవత్సరాలు గడిచిన తర్వాత 2019లో ధోనీ చేసిన రనౌట్‌కు ఏమాత్రం తేడా లేదని.. ధోనీలో చురుకుదనం ఏమాత్రం తగ్గలేదని క్రీడా పండితులు అంటున్నారు.

ఇంకా 2009, 2019ల్లో ధోనీ కివీస్ గడ్డపై చేసిన రనౌట్‌లను పోల్చుతూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధోనీ రనౌట్‌లకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అశ్విన్ సమయం ముగిసింది.. మాకు కుల్దీపే ముఖ్యం : రవిశాస్త్రి