Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫ్రొఫైల్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఫ్రొఫైల్

WD

హైదరాబాద్ (ఏజెన్సీ) , ఆదివారం, 3 జూన్ 2007 (18:08 IST)
క్రికెట్ దిగ్గజం సర్ డోనాల్డ్ బ్రాడ్‌మెన్‌‌తో ప్రశంసలు అందుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. అంతర్జాతీయ క్రికెట్‌లో డెబ్భైకు పైగా సెంచరీలు కొట్టిన తొలి క్రికెటర్‌గా ఖ్యాతి గడించాడు. తన 16వ ఏటలోనే పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రవేశించిన సచిన్.. ఆ తర్వాత తన కెరీర్‌లో ఏమాత్రం వెనుదిరిగి చూడలేదు. మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబైలో 1973 ఏప్రిల్ 24వ తేదీన జన్మించాడు.

ఆడిన జట్లు : భారత్, ఏసీసీ, ఆసియన్-XI ముంబై, యార్క్‌షైర్ జట్ల తరపున ఆడాడు.
నిక్ నేమ్స్ : టెండ్యా, లిటిల్ మాస్టర్, మాస్టర్ బ్లాస్టర్.
బ్యాటింగ్ స్టైల్ : కుడి చేతి వాటం.
బౌలిగ్ స్టైల్ : లెగ్ బ్రేక్ గుగ్లీ

ఆడిన టెస్టులు.. 136, చేసిన పరుగులు.. 10,800, సెంచరీలు.. 36, అర్థ సెంచరీలు..43.
ఆడిన వన్డే మ్యాచ్‌లు.. 384, పరుగులు.. 14,847, సెంచరీలు.. 41, అర్థ సెంచరీలు..77.

టెస్టుల్ అత్యధిక పరుగులు.. 248 నాటౌట్.
వన్డేల్లో అత్యధిక పరుగులు.. 186 నాటౌట్.

బౌలింగ్ (టెస్టుల్లో) 136 టెస్టుల్లో 39 వికెట్లు పడగొట్టగా, వన్డేల్లో 149 వికెట్లు తీశాడు.

అంతర్జాతీయ టెస్టు క్రికెట్ రంగ ప్రవేశం.. 1989 నవంబరు 15-20 తేదీల్లో పాకిస్తాన్ దేశంపై.
వన్డేల్లో ప్రవేశం... 1989 డిసెంబరు 18వ తేదీన గుజరన్‌వాలాలో పాకిస్తాన్‌పై.

అవార్డులు, రివార్డులు.. విస్డన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు 1997లో ఎంపికయ్యాడు.

Share this Story:

Follow Webdunia telugu