Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆ ప్లేస్‌లో ధోనీ ఎందుకు అవసరమంటే ఇందుకే.. మూడో వన్డేలో విండీస్ లక్ష్యం 252 పురుగులు

ఆంటిగ్వాలో జరుగుతున్న మూడో వన్డేలో 40 ఓవర్ల వరకు విండీస్ బౌలర్లు భారత బ్యాటింగ్ శ్రేణికి చుక్కలు చూపించారు. ఏ జట్టైనా సరే త్రిశతకాలు బాదడం అలవాటుగా మారిపోయిన టీమిండియాను విండీస్ జట్టు ఎంత కట్టడి చేసిందంటే 30 ఓవర్లలో భారత్ జట్టు కేవలం 110 పరుగులు మాత్

ఆ ప్లేస్‌లో ధోనీ ఎందుకు అవసరమంటే ఇందుకే.. మూడో వన్డేలో విండీస్ లక్ష్యం 252 పురుగులు
చెన్నై , శుక్రవారం, 30 జూన్ 2017 (23:27 IST)
ఆంటిగ్వాలో జరుగుతున్న మూడో వన్డేలో 40 ఓవర్ల వరకు విండీస్ బౌలర్లు భారత బ్యాటింగ్ శ్రేణికి చుక్కలు చూపించారు. ఏ జట్టైనా సరే త్రిశతకాలు బాదడం అలవాటుగా మారిపోయిన టీమిండియాను విండీస్ జట్టు ఎంత కట్టడి చేసిందంటే 30 ఓవర్లలో భారత్ జట్టు కేవలం 110 పరుగులు మాత్రమే చేసింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత స్లోగా భారత్ ఆడటానికి స్లో పిచ్ కారణం కాగా విండీస్ బౌలర్లు క్రమం తప్పకుండా నిలకగా బౌలింగ్ చేయడమే. 
 
కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధావన్ పేలవంగా ఆడి త్వరత్వరగా పెవిలియన్ చేరడంతో గాడి తప్పిన టీమిండియాను యువరాజ్, రహానే, ధోనీ చివర్లో కేదార్ ఆదుకున్నారు. దీంతో 50 ఓవర్లు ముగిసేసరికి 251 పరుగులు చేసిన భారత్ తన ప్రత్యర్థి విండీస్ జట్టుకు 252 పరుగుల విజయలక్ష్యాన్ని విధించింది. ఒక దశలో 35 ఓవర్లకు 131 పరుగులు మాత్రమే చేసిన భారత్ చివరి 15 ఓవర్లలో 120 పరుగులు చేయగలిగిందంటేనే ధోనీ, కేదార్ జాదవ్ మెరుపు బ్యాటింగే కారణం.
 
నిలకడలేమి ఫామ్‌తో సతమతవవుతున్న భారత మాజీ కెప్టెన్‌ ధోని మెరిశాడు. విమర్శకులకు బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చి జట్టు తన అవసరమెంటో మరోసారి గుర్తు చేశాడు. భారత్‌-వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో క్లిష్ట పరిస్థితిలో అర్ధ సెంచరీ బాది జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు. ఇక సూపర్‌ ఫామ్‌లో ఉన్న అజింక్యా రహానే కూడా రాణించడంతో భారత్‌ విండీస్‌కు 252 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. బౌలింగ్‌ పిచ్‌ కావడంతో బ్యాట్స్‌మెన్‌ పరుగుల కోసం తీవ్రంగా శ్రమించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(2), కెప్టెన్‌ కోహ్లీ(11) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
 
ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన యువరాజ్‌ సింగ్‌తో మరో ఓపెనర్‌ రహానే ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. జట్టు స్కోరు 100 వద్ద స్పిన్నర్‌ దేవేంద్ర బిషూ బౌలింగ్‌లో యువరాజ్‌ సింగ్‌ (39 55 బంతుల్లో 4 ఫోర్లు) వికెట్ల ముందు దొరకడంతో 66 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రహానే, ధోనితో కలిసి తన ఫామ్‌ను కొనసాగిస్తూ 89 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. 
 
జట్టు స్కోరు 170 వద్ద రహానే (71; 112 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్‌)ను కమిన్స్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఇక చివర్లో ధోని (78; 79 బంతులు, 4 ఫోర్లు, 2 సిక్సులు‌), కేదార్‌ జాదవ్‌( (40; 26 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్‌) దాటిగా ఆడటంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఇక విండీస్‌ బౌలర్లలో కమిన్స్‌(2) వికెట్లు తీయగా హోల్డర్‌,బిషూలకు తలా ఓ వికెట్‌ దక్కింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భవిష్యత్తు క్రికెటర్ల ప్రదాత అతడే.. ది వాల్‌పై బీసీసీఐ అపార విశ్వాసం