Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుండె పగిలిన టీమ్ ఇండియా.. 9 పరుగుల తేడాతో చేజారిన వరల్డ్ కప్..విజేత ఇంగ్లాండ్

అదృష్టం దురదృష్టంతో దోబూచులాడిన కీలక క్షణాలు. 130 కోట్లమంది భారతీయుల ఆశలను అయిదే అయిదు ఓవర్లు చెల్లాచెదరు చేసిన విషాద క్షణాలు. ఆశలు పెంచిన టీమిండియా మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్‌ను త్రుటిలో ఇంగ్లండుకు

గుండె పగిలిన టీమ్ ఇండియా.. 9 పరుగుల తేడాతో చేజారిన వరల్డ్ కప్..విజేత ఇంగ్లాండ్
hyderabad , ఆదివారం, 23 జులై 2017 (22:40 IST)
అదృష్టం దురదృష్టంతో దోబూచులాడిన కీలక క్షణాలు. 130 కోట్లమంది భారతీయుల ఆశలను అయిదే అయిదు ఓవర్లు చెల్లాచెదరు చేసిన విషాద క్షణాలు. ఆశలు పెంచిన టీమిండియా మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్‌ను త్రుటిలో ఇంగ్లండుకు కోల్పోయింది. ఐసీసీ మహిళల న్డే వరల్డ్ కప్  ఫైనల్ పోటీలో ఇంగ్లండ్ విధించిన 229 పరుగుల లక్ష్యాన్ని దాదాుపుగా ఛేదించినట్లే కనబడిన టీమిండియా మహిళల జట్టు చివరి ఓవర్లో ఒత్తిడిని అధిగమించలేక చేతులారా ఓటమిని కొనితెచ్చుకుంది. చివరివరకూ విజయం మనదే అనిపించిన ఆశలను, ఆకాంక్షలను ఒకే ఒక్క ఇంగ్లండ్ బౌలర్ తెంచివేసింది. కూల్ అండ్ కామ్‌గా వచ్చిన ఇంగ్లండ్ బౌలర్ అన్యా ష్రుబ్‌సోల్ భారత్ ఆశలపై నీళ్లు చల్లింది. 
 
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ మరోసారి ఛాంపియన్‌గా అవతరించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌పై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. 229 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన మిథాలీ సేన ఆఖరు వరకూ పోరాడినా లక్ష్యాన్ని చేధించలేకపోయింది. 48.4 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ పూనమ్‌ రౌత్‌(86) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. హర్మన్‌ ప్రీత్‌ అర్థశతకంతో (51)రాణించింది. వేద కృష్ణమూర్తి (35), కెప్టెన్‌ మిథాలీ రాజ్‌(17)పరుగులు చేశారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ష్రుబ్‌షోలే 4/45తో భారత వికెట్ల పతనంలో కీలక పాత్ర పోషించింది.
 
అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. స్కీవర్‌ (51) టాప్‌ స్కోరర్‌గా నిలవగా టేలర్‌(45) రాణించింది. ఇంగ్లిష్ బ్యాట్స్ విమెన్‌లలో లారెన్ విన్‌ఫీల్డ్ 24, టామీ బీమౌంట్ 23, సారా టేలర్ 45, నటాలీ షివర్ 51, కేథరిన్ బ్రంట్ 34, జెన్నీ గన్ 25, లారా మార్ష్ 14 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో ఝులన్ గోస్వామి 3, రాజేశ్వరి గైక్వాడ్ 1, పూనమ్ యాదవ్ 2 వికెట్లు తీశారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళల వరల్డ్ కప్ : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్