Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీమిండియాకు 2018 కలిసొచ్చిందా? (video)

టీమిండియాకు 2018 కలిసొచ్చిందా? (video)
, గురువారం, 20 డిశెంబరు 2018 (16:19 IST)
2018 క్యాలెండర్ టీమిండియాకు బాగా కలిసొచ్చింది. వన్డేల్లో 75 శాతం మ్యాచ్‌ల్లో భారత్ గెలుపును నమోదు చేసుకుంది. తద్వారా వన్డేల్లో సక్సెస్‌ఫుల్ టీమ్‌గా టీమిండియా నిలిచింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌‌లో టీమిండియా మెరిసింది.


విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల సారథ్యంలో 2018లో భారత్.. 20 మ్యాచ్‌ల్లో 14 విజయాలను ఖాతాలో వేసుకుంది. టీమిండియా తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కూడా ఆడిన 24 మ్యాచ్‌ల్లో 17 విజయాలతో 73.91 శాతం సక్సెస్ రేటును సాధించింది. 
 
అలాగే దక్షిణాఫ్రికాతో ఫిబ్రవరి (2018)లో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆపై దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ మైదానంలో జరిగిన రెండో వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. ఇంకా కేప్‌టౌన్‌లో జరిగిన మూడో వన్డేలో కూడా ఆతిథ్య జట్టును ఓడించి 124 రన్ మార్జిన్‌తో అదరగొట్టింది. 
 
ఇదే తరహాలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరు వన్డే మ్యాచ్‌లతో కూడిన సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. తద్వారా దక్షిణాఫ్రికా గడ్డపై ఆతిథ్య జట్టును మట్టికరిపించి ద్వైపాక్షిక సిరీస్‌ను సొంతం చేసుకున్న జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ 558 పరుగులు సాధించాడు. 
 
దక్షిణాఫ్రికాకు తర్వాత ఇంగ్లండ్‌తో టీమిండియా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడింది. ఈ సిరీస్‌లో 2-1 తేడాతో ఓడింది. తొలి మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గినా.. తర్వాతి రెండు వన్డేల్లో కోహ్లీ సేన రాణించలేకపోయింది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ తర్వాత కెప్టెన్‌గా కోహ్లీ విరామం తీసుకున్నాడు. దీంతో రోహిత్ శర్మకు బీసీసీఐ కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చింది. 
webdunia
 
ఆసియా కప్ పోటీలు సెప్టెంబరులో అరబ్ దేశంలో జరిగాయి. రోహిత్ సారథ్యంలోని టీమిండియా ఆసియాకప్‌లో భాగంగా హాంకాంగ్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను మట్టికరిపించింది. కోహ్లీ సారథిగా లేకపోయినా.. రోహిత్ సీనియర్ కెప్టెన్ ధోనీ సలహాతో జట్టును సమర్థవంతంగా నడిపించి.. ఆసియా కప్‌ను సంపాదించిపెట్టాడు. తద్వారా సెప్టెంబరులో టీమిండియా ఆసియా కప్‌ను గెలుచుకుంది. 
 
ఈ సిరీస్‌లో సూపర్ ఫోర్త్ స్టేజ్ మ్యాచ్‌లో ఆడటం ద్వారా ధోనీ 200వ వన్డే మ్యాచ్‌ను ఆడిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే అక్టోబరులో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 3-1 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. ఇందుకు కీలక పేసర్లకు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వడమే. ఇకపోతే.. 2018 క్యాలెండర్ ఇయర్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 
 
ఆడిన 14 వన్డేల్లో 1202 పరుగులను సాధించాడు. తద్వారా 133.55 యావరేజ్ కొట్టాడు. ఇందులో ఆరు శతకాలు వున్నాయి. అలాగే మరో ఆటగాడు రోహిత్ శర్మ కూడా 1030 పరుగులతో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. ఇంకా భారత్ ఓపెనర్ అయిన రోహిత్ శర్మ ఐదు శతకాలను ఈ ఏడాది తన ఖాతాలో వేసుకున్నాడు. 
webdunia
 
బౌలర్ల సంగతికి వస్తే కుల్దీప్ యాదవ్ 19 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు సాధించాడు. స్ట్రైక్స్ రేటును 22.9తో యావరేజ్‌ 17.7తో నిలిచాడు. ఈ ఏడాది చివర్లో భారత్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను గెలిచింది. అలాగే జనవరి 2019లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ (ఐదు మ్యాచ్‌లు) ఆడనుంది. ఇక 2019లో వన్డే ప్రపంచ కప్ గెలవాలనే ఉత్సుకతో భారత జట్టు వుంది. 2019 మేలో జరిగే వన్డే ప్రపంచ కప్‌పైనే అందరి కన్ను వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ విరాట్ కోహ్లీనే టాప్ : ఎందులో?