Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పన్నీరుసెల్వంకు ఉపముఖ్యమంత్రి పదవి లేనట్లే..

పన్నీరుసెల్వం - పళణిస్వామిలకు మధ్య జరుగుతున్న రసవత్తర చర్చలో పన్నీరుకే ఎక్కువ నష్టం కలిగేలా కనిపిస్తోంది. మొదట్లో పన్నీరుసెల్వం పళణితో కలిసేందుకు రెండు డిమాండ్లను ముందుంచారు.

పన్నీరుసెల్వంకు ఉపముఖ్యమంత్రి పదవి లేనట్లే..
, శుక్రవారం, 11 ఆగస్టు 2017 (11:10 IST)
పన్నీరుసెల్వం - పళణిస్వామిలకు మధ్య జరుగుతున్న రసవత్తర చర్చలో పన్నీరుకే ఎక్కువ నష్టం కలిగేలా కనిపిస్తోంది. మొదట్లో పన్నీరుసెల్వం పళణితో కలిసేందుకు రెండు డిమాండ్లను ముందుంచారు. అందులో ఒకటి శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి శాశ్వతంగా పంపెయ్యాలి.. 2.జయలలిత మరణంపై విచారణ జరిపించాలి... అయితే ఇది కాస్త చేయలేదు పళణి. దీంతో ఇద్దరి మధ్య మళ్ళీ సఖ్యత కాస్త మరింత దూరాన్ని పెంచింది. 
 
కానీ ఈసారి మాత్రం ఏకంగా కేంద్రం ఇద్దరినీ బుజ్జగించి ఒకటయ్యేందుకు మార్గం సుగుమం చేసింది. ఒకవైపు దినకరన్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేయడమేకాకుండా పార్టీలోని వారందరినీ లాక్కునే ప్రయత్నం చేయడం అటు పన్నీరు, ఇటు పళణిలకు అస్సలు ఇష్టం లేదు. కేంద్రం కూడా వీరిద్దరివైపే ప్రత్యేక దృష్టి పెడుతోంది. అందుకే పంతాలకు పోయి ఉన్నది కాస్త ఊడగొట్టుకోవద్దంటూ ఇద్దరికి క్లాస్ ఇచ్చారు బీజేపీ అగ్రనాయకులు.
 
దీంతో పళణిస్వామితో జతకట్టేందుకు పన్నీరుసెల్వం సిద్ధమైపోయారు. తన డిమాండ్లను పట్టించుకోకున్నా.. పదవులు ఇవ్వకున్నా ఫర్వాలేదు.. ఎలాగోలా సర్ధుకుపోవాలన్న నిర్ణయానికి వచ్చేశారట పన్నీరుసెల్వం. ఇది కాస్త పళణికి ప్లస్ అయ్యింది. అందుకే పన్నీరుసెల్వంకు పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వకూడదన్న నిర్ణయానికి వచ్చేశారట. 
 
పన్నీరుసెల్వంకు ఆ విషయం తెలిసినా దాన్ని అస్సలు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తామిద్దరం కలిసి ఉంటే వేరొకరు మధ్యలోకి వచ్చే అవకాశం లేదన్నది పన్నీరు ఆలోచన. అందుకే ఇద్దరు శత్రువులు కాస్త మిత్రులు మారిపోనున్నారు. మరో రెండు, మూడురోజుల్లోకి ఇద్దరు విలీనం అయినట్లు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు పన్నీరుసెల్వం, పళణిస్వామిలు. మొత్తం మీద వీరి హైడ్రామాకు త్వరలోనే తెరపడనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్‌లో ఇన్‌స్టంట్ మనీ ట్రాన్స్‌ఫర్ ఫీచర్.. డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు..