Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం: థీమ్ ఏంటి?

woman
, శనివారం, 25 నవంబరు 2023 (12:29 IST)
మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవం నేడు. ఈ రోజుకు సంబంధించిన చరిత్ర, ప్రాముఖ్యత, థీమ్ ఏమిటో తెలుసుకుందాం.
 
మహిళలపై హింస, వేధింపులు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సమస్య. ఇంట్లో గృహ హింస లేదా లైంగిక వేధింపులు లేదా హత్యలు వంటివి మహిళలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా హింసకు మహిళలు భయపడుతున్నారు. మహిళలపై అన్ని రకాల హింసను నిరోధించడానికి మనమందరం చేతులు కలపాలి.
 
కోవిడ్-19 మహమ్మారి మహిళలపై హింసను నిరోధించడాన్ని వేగవంతం చేసింది. కొన్ని సేవలకు అంతరాయం కూడా హింసకు తోడైంది. ప్రతి సంవత్సరం, మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించారు. మహిళలపై హింసను నిరోధించడానికి ఈ రోజును జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ 25 న జరుపుకుంటారు. ఈ సంవత్సరం శనివారం (నేడు) జరుపుకుంటారు.
 
చరిత్ర
1979లో, UN జనరల్ అసెంబ్లీ మహిళలపై అన్ని రకాల హింసను నిర్మూలించాలని పిలుపునిచ్చింది. కానీ మహిళలపై హింస మాత్రం కొనసాగుతోంది. 2008లో ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టారు.
 
1981 నుండి, మహిళా హక్కుల కార్యకర్తలు నవంబర్ 25న మహిళలపై హింస నిర్మూలన కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
 
లింగ-ఆధారిత హింసకు వ్యతిరేకంగా ఏకం అవ్వండి అనేది ఈ సంవత్సరం థీమ్. మహిళలు, బాలికలపై హింసను నిరోధించడంపై చేతులు కలపాలి. యూఎన్ మహిళలు తమ వెబ్‌సైట్‌లో నేర నిరోధక విధానాలను అభివృద్ధి చేయాలని, లింగ ఆధారిత హింసను ఆపాలని రాశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంత్రి మల్లారెడ్డికి షాక్.. అనుచరుల ఇళ్ళలో సోదాలు