Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దీపావళి రోజున ఆకుపచ్చని రంగులో కూర్చున్న శ్రీ లక్ష్మీదేవిని?

దీపావళి రోజున ఆకుపచ్చని రంగు కూర్చున్న శ్రీ మహాలక్ష్మీదేవి పటాన్నిగానీ, వెండితో తయారైన లక్ష్మీదేవి ప్రతిమను గానీ పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. దీపావళి రోజున ఉదయం ఐదు గంటలకు లేచి, తలస్నానం

దీపావళి రోజున ఆకుపచ్చని రంగులో కూర్చున్న శ్రీ లక్ష్మీదేవిని?
, మంగళవారం, 17 అక్టోబరు 2017 (16:16 IST)
దీపావళి రోజున ఆకుపచ్చని రంగు కూర్చున్న శ్రీ మహాలక్ష్మీదేవి పటాన్నిగానీ, వెండితో తయారైన లక్ష్మీదేవి ప్రతిమను గానీ పూజించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. దీపావళి రోజున ఉదయం ఐదు గంటలకు లేచి, తలస్నానం చేసి పూజామందిరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

గడపకు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరంలో అందమైన ముగ్గులతో తీర్చిదిద్దుకోవాలి. తెలుపు బట్టలు ధరించాలి. పూజగదిలో పటాలకు గంధము, కుంకుమ, పువ్వులతో అలంకరించాలి. లక్ష్మీదేవి పటం ముందు ఎర్రటి అక్షతలు, ఎర్ర పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబి పువ్వులు సిద్ధం చేసుకోవాలి.
 
జామకాయలు, రవ్వలడ్డులు, కేసరి బాత్, అరిసెలు వంటి పిండిపదార్థాలను నైవేద్యం పెట్టి శ్రీ లక్ష్మీ అష్టోత్తరము, శ్రీ మహాలక్ష్మీ అష్టకం స్తోత్రాలను పఠించాలి. పువ్వులతో ఆమెను అర్చించాలి. అంతే కాకుండా శ్రీ సూక్తము, శ్రీ లక్ష్మీ సహస్రనామము, భాగవతము, కనకధారాస్తవము వంటి పారాయణ స్తోత్రాలతో లక్ష్మీదేవిని పూజించాలి. అందులో ముఖ్యంగా భాగవతములోని నరకాసురవధ అధ్యాయమును పారాయణము చేయాలి.
 
దీపావళి రోజున మహాలక్ష్మీ ధ్యానించి విశాఖ కనకమహాలక్ష్మీ దేవి, అష్టలక్ష్మీ దేవాలయం, కొల్హపూర్ వంటి క్షేత్రాలను దర్శించుకుంటే సకల సంపదలు దరిచేరుతాయని విశ్వాసం. ఇదే రోజున కుంకుమ పూజ చేయించిన స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తం చేకూరుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. 
 
దీపావళి పర్వదినాన దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీ కుబేర వ్రతము లేదా వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పండితులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపావళి స్పెషల్.. కొబ్బరి బొబ్బట్లు ఎలా చేయాలి