Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎలాంటి ముఖాలకు ఎలాంటి హెయిర్ కట్...

అందం అంటే సాధారణంగా మహిళలు అందరూ ఇష్టపడతారు. దీని కోసం బ్యూటీపార్లను ఆశ్రయిస్తారు. రకరకాల దుస్తులు, అలంకరణ సామాగ్రిని వాడుతుంటారు. కాని ముఖం ఆకారాన్ని బట్టి ఆభరణాలు ధరించడం, హెయిర్ స్టైల్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల మనం అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్

ఎలాంటి ముఖాలకు ఎలాంటి హెయిర్ కట్...
, బుధవారం, 22 ఆగస్టు 2018 (22:23 IST)
అందం అంటే సాధారణంగా మహిళలు అందరూ ఇష్టపడతారు. దీని కోసం బ్యూటీపార్లను ఆశ్రయిస్తారు. రకరకాల దుస్తులు, అలంకరణ సామాగ్రిని వాడుతుంటారు. కాని ముఖం ఆకారాన్ని బట్టి ఆభరణాలు ధరించడం, హెయిర్ స్టైల్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల మనం అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.
 
1. ముఖం మరీ గుండ్రంగా ఉన్నవాళ్లు పొట్టి జుట్టు ఉంచుకోవడమే మంచిది. దానివల్ల ముఖం ఇంకా గుండ్రంగా కనిపిస్తుంది. ఒకవేళ పొట్టి జుట్టే కావాలనుకుంటే పాపిట మధ్యలో కాకుండా కాస్త పక్కకుండే హెయిర్ స్టైల్ ఎంచుకోవాలి. పొడవు జుట్టుకైతే త్రీ లేయర్డ్ హెయిర్ కట్ నప్పుతుంది.
 
2. కోల ముఖం ఉన్నట్లయితే పొట్టిగా ఉండే బాబ్ హెయిర్ కట్‌లు భుజాల వరకూ కర్లింగ్ చేయించుకున్న జుట్టు నప్పుతుంది.
 
3. చతురస్రాకార ముఖం ఉన్నవాళ్లకు నుదురూ, గడ్డం భాగం ఒకే వెడల్పుతో ఉంటాయి. వారికి జుట్టు భుజాల వరకూ ఉంటే.. ఫెదర్ హెయిర్ కట్, పొట్టిగా ఉంటే లేయర్డ్ బాబ్ కట్, పొడవుగా ఉంటే మధ్యలో పాపిట తీసిన లేయర్డ్ హెయిర్ కట్ ప్రయత్నించవచ్చు.
 
4. హృదయాకార ఆకృతి ఉంటే నుదురు భాగం విశాలంగా కనిపిస్తుంది. అందుకే ఫ్రింజెస్, కాస్త పక్కకు తీసిన పాపిట, ఫంకీ హెయిర్ స్టైల్ బాగుంటాయి. 
 
5. ముఖం త్రిభుజాకారంలో ఉంటే దవడ భాగం నుదురు కన్నా వెడల్పుగా కనిపిస్తుంది. అలాంటప్పుడు జుట్టు భుజాలవరకూ ఉంటే దానిని కర్లింగ్ చేయించాలి. దానివల్ల కింది భాగం కూడా కాస్త విశాలంగా కనిపిస్తుంది. పొట్టి జుట్టుకైతే  గడ్డం వరకూ ఉండే చిన్ లెంగ్త్ బాబ్ కట్ బాగుంటుంది. ఇలా మన హెయిర్ స్టైల్‌ను మార్చుకోవడం వల్ల మన అందాన్ని మెరుగుపరచుకోవచ్చు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళా దుంప రసాన్ని తీసి కళ్లపైన అలా రాసుకుంటే?