Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెజ‌వాడ‌లో అద‌ర‌గొట్టిన డిజైన‌ర్ వీక్... వైష్ణ‌వి రెడ్డి ఫ్యాష‌న్ షో

విజ‌య‌వాడ‌: క‌ట్టు బొట్టుకు ప్రాధాన్యం ఇచ్చే మ‌న తెలుగు వారి సంప్ర‌దాయం క‌ళ్ల‌ముందు క‌ద‌లాడింది. వివాహ సంప్ర‌దాయాన్ని చాటే బ్రైడ‌ల్ క‌లెక్ష‌న్ షో అద‌ర‌గొట్టేసింది. ప్ర‌ముఖ డిజైన‌ర్ వైష్ణ‌వి రెడ్డి ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ‌లో ఆదివారం సాయంత్రం ఫ్యాష‌న్ షో

బెజ‌వాడ‌లో అద‌ర‌గొట్టిన డిజైన‌ర్ వీక్... వైష్ణ‌వి రెడ్డి ఫ్యాష‌న్ షో
, సోమవారం, 11 డిశెంబరు 2017 (21:17 IST)
విజ‌య‌వాడ‌: క‌ట్టు బొట్టుకు ప్రాధాన్యం ఇచ్చే మ‌న తెలుగు వారి సంప్ర‌దాయం క‌ళ్ల‌ముందు క‌ద‌లాడింది. వివాహ సంప్ర‌దాయాన్ని చాటే బ్రైడ‌ల్ క‌లెక్ష‌న్ షో అద‌ర‌గొట్టేసింది. ప్ర‌ముఖ డిజైన‌ర్ వైష్ణ‌వి రెడ్డి ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ‌లో ఆదివారం సాయంత్రం ఫ్యాష‌న్ షో జ‌రిగింది. వివిధ దేశాల‌కు  డిజైన‌ర్ వేర్‌ను అందిస్తున్నడిజైన‌ర్ వైష్ణ‌వి రెడ్డి ఇపుడు తొలిసారిగా న‌వ్యాంధ్ర రాజ‌ధానిలో బ్రైడ‌ల్ క‌లెక్ష‌న్ షో నిర్వ‌హించారు. 
 
జీవితంలో మ‌రపురాని పెళ్ళి సంద‌డిని ర్యాంపు పైన క‌ళ్ళ‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. వివాహ వేడుక‌ల్లో తొలి ఘ‌ట్టం ప‌సుపు కొట్ట‌డం. ఆ వేడుక‌ను వేదిక‌పై మోడ‌ల్స్‌కు ప‌సుపు రంగుల‌ద్ది సంప్ర‌దాయబ‌ద్ధంగా ప్ర‌ద‌ర్శించారు. ప‌సుపు కొట్టిన త‌ర్వాతే పెళ్లి ప‌నులన్నీ మొద‌ల‌వుతాయి. ఆ త‌ర్వాత పెళ్ళికూతురును చేయ‌డం, ఇందులో పెళ్ళికూతురు విల‌క్ష‌ణ‌మైన హాఫ్ శ్యారీతో క‌నిపిస్తుంది. 
webdunia
 
ఆ త‌ర్వాత పెళ్ళికి పంచ వ‌ర్ణాల ప‌ట్టు చీరలో వ‌ధువు, ప‌ట్టు పంచె‌, కుర్తాతో వ‌రుడు త‌ళుక్కున మెరిశారు. ఇక చివ‌రికి రిసెప్ష‌న్ ... దీనికి కొంత మోడ‌ర‌న్, కొంత ట్రెడిష‌న‌ల్ డిజైన్ల‌తో గౌన్లు మోడ‌ళ్లు ప్ర‌ద‌ర్శించిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంది. కంప్యూట‌ర్ యుగంలోకి మ‌నం అడుగుపెట్టినా, సంప్ర‌దాయాల‌కు మాత్రం ఎంతో విలువ ఇస్తామ‌ని, అందుకే బ్రైడ‌ల్‌కు న్యూ లుక్ ఇస్తూ, ఈ డిజైన‌ర్ వీక్ నిర్వ‌హించామ‌ని ఫ్యాష‌న్ షో నిర్వాహ‌కురాలు, డిజైన‌ర్ వైష్ణవి రెడ్డి వివ‌రించారు. కొత్త త‌రం ఫ్యాష‌న్ పైన ఎక్కువ‌గా ఆక‌ర్షితులు అవుతున్నార‌ని, అయితే, అది సంప్ర‌దాయం గీత దాట‌కుండా ఎలా ఉండాల‌నే కాన్సెప్ట్‌తో ఈ షో నిర్వ‌హించామ‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో అతిథులుగా ఎమ్మెల్యే బోండా ఉమ‌, మార్గం శ్రీల‌క్ష్మి, అనూరాధ‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మగాళ్లు తుస్ మంటున్నారు.. ఆడోళ్లు రెచ్చిపోతున్నారు.. ఎందులో?