Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎత్తు చెప్పులు వేసుకునే వారు తీసుకోవలసిన జాగ్రత్తలు.....

కాస్త ట్రెండీగా కనిపించడానికి ఎత్తుచెప్పులు కొనుక్కుంటాం. కానీ వాటిని వేసుకున్నప్పుడు సరిగ్గా నడవలేకపోతే చూసేవాళ్లకు, మనకు ఇబ్బందిగా ఉంటుంది. అడుగు వేసేటప్పుడు చెప్పు ముందుబాగం కాకుండా మెుదట హీల్ నేలన

ఎత్తు చెప్పులు వేసుకునే వారు తీసుకోవలసిన జాగ్రత్తలు.....
, గురువారం, 19 జులై 2018 (14:37 IST)
కాస్త ట్రెండీగా కనిపించడానికి ఎత్తుచెప్పులు కొనుక్కుంటాం. కానీ వాటిని వేసుకున్నప్పుడు సరిగ్గా నడవలేకపోతే చూసేవాళ్లకు, మనకు ఇబ్బందిగా ఉంటుంది. అడుగు వేసేటప్పుడు చెప్పు ముందుబాగం కాకుండా మెుదట హీల్ నేలను తాకేలా చూసుకోవాలి. దీనివలన అడుగుల్లో తడబాటు కనిపించదు. కొన్ని రోజులు ప్రయత్నిస్తే తరువాత అలవాటవుతుంది.
 
ఎత్తుచెప్పులు కొన్న కొత్తలో కాస్త జారిపోతుంటాయి. అందుకే కిందివైపు శాండ్‌పేపర్‌తో కాని, నెయిల్ పైల్‌తో కాని రాయాలి. ఇలా చేయడం వలన నడుస్తున్నప్పుడు పట్టు ఉంటుంది. సాధన చేస్తున్నప్పుడు మెుదట్లో ఏదైనా పాటకు అనుగుణంగా నడుస్తుండాలి. దానివలన తడబడకుండా నడవడం అలవాటవుతుంది.
 
ఆ చెప్పుల వలన బరువు మెుత్తం మడిమ భాగంలో పడుతుంది. అందుకే మడమ కింద షూ ఇన్సర్ట్స్ లేదంటే ఫూట్ ప్యాడ్స్ ఉపయోగించాలి. వాటివలన పాదాలు జారకుండా ఉంటాయి. ముందు భాగం కాస్త దళసరిగా ఉన్నవాటినే ఎంచుకోవాలి. వీలైనంత వరకు పాదం ముందు వైపు కప్పి ఉంచే చెప్పుల్ని ఎంచుకుంటే మంచిది. కొంతమందికి నడుస్తున్నప్పుడు పాదాలు నొప్పిగా ఉంటాయి.
 
మధ్యవేలు, నాలుగో వేలును కలిపి ప్లాస్టర్ కాని, బ్యాండ్ ఎయిడ్ కాని చుట్టుకుని మంచి ఫలితం లభిస్తుంది. కొనుగోలు చేసేముందు ఒకటి రెండు సార్లు నడవడం మంచిది. మీకు సౌకర్యంగా ఉన్నాయో లేదో గమనించుకోవాలి. కొత్త ష్యాషన్ అనుకోకుండా మనకు నప్పేవే ఎంచుకుంటే మంచిది. సాధ్యమైనంత వరకు రెండు అంగులాకు మించి ఎత్తున్న చెప్పులను వాడకూడదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిలబడి నీళ్ళు తాగితే ఏమవుతుందో తెలుసా?