Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంట్లో నగ్న ఫోటోలేంటి? నటరాజ స్వామి తాండవ నృత్యం ఫోటోలు అస్సలుండకూడదట!

ఇంట్లో పారే జలపాతాలు, తాజ్ మహల్, ఏడ్చే చిన్నారి ఫోటో, రామాయణ మహాభారత యుద్ధానికి సంబంధించిన పెయింటింగ్స్ పెట్టకూడదని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.

ఇంట్లో నగ్న ఫోటోలేంటి? నటరాజ స్వామి తాండవ నృత్యం ఫోటోలు అస్సలుండకూడదట!
, బుధవారం, 29 జూన్ 2016 (12:07 IST)
వాస్తు, ఫెంగ్‌షుయ్ ప్రకారం ఇంటిని అలంకరించుకోవడం ద్వారా శుభఫలితాలు వస్తాయి. వాస్తు, ఫెంగ్‌షుయ్‌ని అనుసరిస్తే.. ఆర్థిక లాభాలతో పాటు ఈతిబాధలు తొలగిపోవడం వంటివి జరుగుతాయి. కానీ ఇంట్లో కొన్ని రకాలైన పెయింటింగ్స్ ఉంచడం ద్వారా శుభఫలితాలు దూరంగా వెళ్ళిపోతాయని నిపుణులు అంటున్నారు. కానీ ఇంట్లో పారే జలపాతాలు, తాజ్ మహల్, ఏడ్చే చిన్నారి ఫోటో, రామాయణ మహాభారత యుద్ధానికి సంబంధించిన పెయింటింగ్స్ పెట్టకూడదని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.  
 
ఇంట్లో రామాయణ, మహాభారతానికి సంబంధించిన యుద్ధ సన్నివేశాలను ఇంట్లో పెట్టుకుంటే.. దాయాదుల మధ్య పోరు తప్పదని అందుకే ఈ ఫోటోలను ఇంట్లో వుంచకూడదు. ఇక పారే జలపాతాలకు సంబంధించి పెయింటింగ్స్ ఇంట్లో ఉంచకూడదు. వీటిలో అందం ఉన్నప్పటికీ ఇవి పేదరికాన్ని సూచిస్తాయి. పారే జలపాతంలో సంపద కూడా చేతిలో ఎక్కువ కాలం నిలవదని ఫెంగ్ షుయ్ నిపుణులు అంటున్నారు. 
 
ఇదేవిధంగా మొండిగా ఉండే చెట్లు, నగ్న చిత్రాలను ఇంట్లో ఉంచరాదు. ఇవి దురదృష్టకరం. క్రూర జంతువులు, మునిగిపోతున్న ఓడ, ఏడుస్తున్న చిన్నారుల ఫోటోలు హింసా ప్రవృత్తిని.. కుటుంబ సభ్యుల మధ్య అగాధాన్ని పెంచుతాయి. ఇక నటరాజ స్వామి తాండవ నృత్యం ఫోటోలను ఇంట్లో ఉంచకూడదు. తాండవ నృత్యం అంటేనే వినాశనాన్ని సూచిస్తుంది. అందుకే ఆ ఫోటోలను.. ప్రతిమలను ఇంటి నుంచి తొలగించాలి. అలాగే తాజ్ మహల్ వంటి శోకానికి సంకేతాలు కావడంతో ఆ ఫోటోలను ఇంటి నుంచి తొలగించడం మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కార్యసిద్ధిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ శ్లోకాలు... ఇవే