Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీ బెడ్‌ను ఇతరులు షేర్ చేసుకుంటున్నారా? ఇతరుల దుస్తులు వాడితే ఏమౌతుందో తెలుసా?

స్నేహితులు, సన్నిహితులు, బంధువుల నుంచి ఏది పడితే అవి తీసుకుంటున్నారా? డబ్బు, వస్తువులు, దుస్తులు, అప్పులు వంటివి తీసుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి. ఇతరుల నుంచి ఏదైనా వస్తువు తీసుకునేటప్పుడు ముందు వెన

మీ బెడ్‌ను ఇతరులు షేర్ చేసుకుంటున్నారా? ఇతరుల దుస్తులు వాడితే ఏమౌతుందో తెలుసా?
, గురువారం, 4 మే 2017 (12:52 IST)
స్నేహితులు, సన్నిహితులు, బంధువుల నుంచి ఏది పడితే అవి తీసుకుంటున్నారా? డబ్బు, వస్తువులు, దుస్తులు, అప్పులు వంటివి తీసుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి. ఇతరుల నుంచి ఏదైనా వస్తువు తీసుకునేటప్పుడు ముందు వెనకా ఆలోచించండి. ఇతరుల వస్తువులను ఉపయోగించడం ద్వారా నెగటివ్ ఎనర్జీ వారి నుంచి మనకు పాస్ అవుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఇతరుల వస్తువులను వాడటం ద్వారా అదృష్టం కలగదని, దురదృష్టం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. 
 
ముఖ్యంగా చేతికి కట్టుకునే గడియారాలు, ఇతరుల నుంచి తీసుకునే అప్పును వెంటనే తిరిగి ఇచ్చేయాలి. పెన్‌లను కూడా తిరిగి ఇవ్వడం నేర్చుకోవాలి. ఇతరుల పెన్నులు వాడటం, గడియారాలు, ఇతరుల డబ్బుపై ఆశపడటం వంటివి చేస్తే దురదృష్టం తప్పదని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. చేతి గడియారాలు ఇతరులవి వాడితే ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. 
 
అలాగే అప్పుగా డబ్బు తీసుకునేటప్పుడు.. ఆ మొత్తాన్ని ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది. లేకుంటే వారి నుంచి మనకు నెగటివ్ ఎనర్జీ డబ్బుద్వారా అందుకుంటుందట. ఇక ఇతరుల పెన్నులను వాడితే డబ్బు నిలకడగా వుండదట. ఖర్చులు అధికంగా ఉంటాయట. 
 
ఇంకా ఇతరుల దుస్తులను, ఆభరణాలను వివాహాలకు వాడటం మంచిది కాదు. ఇలా చేస్తే వారి నుంచి నెగటివ్ ఎనర్జీ మనకు చేరుకుంటుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఇతరుల నుంచి తీసుకునే ఏ వస్తువైనా తిరిగి ఇచ్చేయాలి. వాటిపై ఆశపెట్టుకోకూడదు. ఇంకా చెప్పాలంటే ఇతరుల నుంచి వస్తువులను తీసుకోవడం.. ఉపయోగించడం కూడదు. ఇకపోతే.. మీ ఇంటి పడకను ఇతరులు షేర్ చేసుకోకూడదు. అలా చేసుకుంటే వారితో గొడవలు తప్పవని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాబా... నావద్ద ఒక్క పైసా కూడా లేదు....