Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విళంబి నామసంవత్సరం.. ఏ పండుగ.. ఏ తేదీలో...

తెలుగు కొత్త సంవత్సరం విళంబి నామ సంవత్సరంలో వచ్చే పండుగ తేదీలపై వివాదం నెలకొనివుంది. అయినప్పటికీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన జ్యోతిష్య పండితులు, సిద్ధాంతులు మాత్రం పండుగల తేదీలను వెల్లడించారు.

విళంబి నామసంవత్సరం.. ఏ పండుగ.. ఏ తేదీలో...
, మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (10:53 IST)
తెలుగు కొత్త సంవత్సరం విళంబి నామ సంవత్సరంలో వచ్చే పండుగ తేదీలపై వివాదం నెలకొనివుంది. అయినప్పటికీ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన జ్యోతిష్య పండితులు, సిద్ధాంతులు మాత్రం పండుగల తేదీలను వెల్లడించారు. ఈ మేరకు రెండు రోజులపాటు హైదరాబాద్‌లో నిర్వహించిన విద్వత్ సభలో నిర్ణయించారు. ఈ నిర్ణయాలను సభ నిర్వాహకులు ఎం.వెంకటరమణ శర్మ, దివ్యజ్ఞాన సిద్ధాంతి, గాయత్రీ తత్వానంద రుషి, యాయవరం చంద్రశేఖర శర్మలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. 
 
వీరంతా ముఖ్యమంత్రికి అందించిన జాబితా ప్రకారం.. మార్చి 18- ఉగాది,  25న స్మార్తానాం శ్రీరామ నవమి, 26న వైష్ణవానాం శ్రీరామ నవమి, ఏప్రిల్ 18న అక్షయ తృతీయ, మే 10న హనుమాన్ జయంతి, జూలై 27న వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, 29, సికింద్రాబాద్ మహంకాళి జాతర, ఆగస్టు 24 వరలక్ష్మీ వ్రతం, 26న రాఖీ పూర్ణిమ, సెప్టెంబరు 2 స్మార్తానాం శ్రీకృష్ణాష్టమి, 3న వైష్ణవానాం శ్రీకృష్ణాష్టమి, 13న వినాయక చవితి, అక్టోబరు 17న దుర్గాష్టమి, 18న విజయ దశమి, నవంబరు 6న దీపావళి, 23 న కార్తీక పౌర్ణమి, 2019 జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ, 12న రథ సప్తమి, మార్చి 4 మహా శివరాత్రి, 19న కామదహనం (దక్షిణాది వారికి), 20న కామదహనం (ఉత్తరాదివారికి), 21న హోలీ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : ఈ రోజు మీ రాశి ఫలితాలు 12-09-17