Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫిఫా వరల్డ్ కప్ 2018 : రష్యా గర్జన... తొలి పోరులో 5-0తో సౌదీ చిత్తు

ఫిఫా వరల్డ్ కప్ 2018 పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ మ్యాచ్‌లో రష్యా శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో సౌదీపై రష్యా 5-0 గోల్స్ తేడాతో విజయంసాధించింది. గురువారం జరిగిన గ్రూప్‌-ఎ తొలి మ్యాచ్‌లో ఇగ

ఫిఫా వరల్డ్ కప్ 2018 : రష్యా గర్జన... తొలి పోరులో 5-0తో సౌదీ చిత్తు
, శుక్రవారం, 15 జూన్ 2018 (10:31 IST)
ఫిఫా వరల్డ్ కప్ 2018 పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభ మ్యాచ్‌లో రష్యా శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో సౌదీపై రష్యా 5-0 గోల్స్ తేడాతో విజయంసాధించింది. గురువారం జరిగిన గ్రూప్‌-ఎ తొలి మ్యాచ్‌లో ఇగార్‌ అకిన్‌ఫీవ్‌ సారథ్యంలోని రష్యా ఏకంగా 5-0 స్కోరుతో సౌదీ అరేయాను ఓడించింది. తద్వారా వరల్డ్‌కప్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు విజయం సాధించే పరంపరను కొనసాగించింది.
 
వేలాదిమంది అభిమానులు, దేశాధ్యక్షుడు పుతిన్‌ స్వయంగా ఉత్సాహపరిచిన వేళ రష్యా అమోఘమైన ఆటతీరు కనబరిచింది. యూరీ గజిన్‌స్కీ (12వ నిమిషం), డెనిస్‌ చెరిషేవ్‌ (43, 90), అర్టెమ్‌ జ్యూబా (71వ), అలెగ్జాండ్‌ గొలోవిన్‌ (90) రష్యాకు గోల్స్‌ అందించారు. కుడి, ఎడమ వైపులనుంచి రష్యా చేసిన దాడులను చక్కగా అడ్డుకొన్న సౌదీ డిఫెండర్లు ప్రత్యర్థి జట్టు రెండు గోల్స్‌ అవకాశాలను వమ్ము చేశారు. 
 
మ్యాచ్ ప్రథమార్థం ముగిసే సరికి రష్యా 2-0 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్థంలో మరో సబ్‌స్టిట్యూట్‌ అర్టెమ్‌ జ్యూబా ఆతిథ్య జట్టుకు మూడో గోల్‌ అందించాడు. ఇంజురీ టైమ్‌లో మరోసారి విజృంభించిన చెరిషేవ్‌ టాప్‌ కార్నర్‌నుంచి ఎడమ కాలితో కళ్లు చెదిరే రీతిలో బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో రష్యా 4-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక ఆఖరి క్షణాల్లో గోలోవిన్‌ ఫ్రీకిక్‌ను అద్భుత రీతిలో గోల్‌గా మలిచి మ్యాచ్‌కు ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అట్టహాసంగా ఫిఫా ప్రపంచకప్ ప్రారంభం.. అడుగడుగునా భద్రత