Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాంగల్యంలో స్త్రీలు ముత్యాన్ని చేర్చుకుంటే..?

మాంగల్యంలో స్త్రీలు ముత్యాన్ని చేర్చుకుంటే..?
, శనివారం, 17 జనవరి 2015 (15:41 IST)
స్త్రీలు తమ మాంగల్యానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. తమ సౌభాగ్యాన్ని నిలుపుకునేందు వ్రతాలు, నోములు నోస్తారు. మాంగల్యానికి దృష్టి సంబంధమైన దోషాలు తొలగిపోవడానికి నల్లపూసలు, సంతాన భాగ్యాన్ని కలిగించే పగడాలను తమ సూత్రాలకు చేరుస్తుంటారు.
 
ఈ నేపథ్యంలో చంద్రగ్రహ కారకాలుగా చెప్పబడే 'ముత్యాలు' కూడా స్త్రీలు ఎక్కువగా ఉపయోగిస్తూ వుంటారు. ఇక స్త్రీలు మంగళ సూత్రానికి ముత్యాన్ని చేర్చే ఆచారం మనకి ప్రాచీనకాలం నుంచి కనిపిస్తుంది. 
 
శ్రీరామమవమి రోజున సీతారాముల కల్యాణం జరినప్పుడు ... అలాగే తమ ఊళ్లో వేంకటేశ్వరస్వామి కల్యాణం జరిగినప్పుడు, అత్తవారింట్లో వున్న ఆడపిల్లలను ఆహ్వానించే ఆచారం వుంది.
 
కల్యాణం సమయంలో స్వామివారికి .. అమ్మవారికి ముత్యాల తలంబ్రాలు పోస్తారు. అలా పోయబడిన ముత్యాలను అక్కడి అర్చకులు వివాహితులైన స్త్రీలకు ఒక్కొక్కటి చొప్పున ఇస్తుంటారు. 
 
ఆ ముత్యాన్ని మంగళ సూత్రానికి చేర్చి కట్టుకోవడం వలన, అమ్మవారి అనుగ్రహంతో సౌభాగ్యం సుస్థిరమవుతుందని స్త్రీలు భావిస్తుంటారు. ప్రాచీనకాలం నుంచి ఈ విశ్వాసం బలపడుతూ రావడం వలన ఈ ఆచారం ఇప్పటికీ నిలిచివుందని చెప్పొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu