Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీకు తెలుసా?... భూమి బరువు రోజుకు 100 టన్నులు పెరుగుతోంది...

కొన్ని విషయాలు మనకు తెలియవు. కానీ తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం... 1. మన శరీరంలోని నాడీ వ్యవస్థలోని నాడులు ఒక సెకనుకు 300 అడుగుల వంతున సందేశాలు అందిస్తాయి. 2. ప్రపంచంలోకెల్లా అతి చిన్న మానవ ప్రాణి డచ్ దేశ

మీకు తెలుసా?... భూమి బరువు రోజుకు 100 టన్నులు పెరుగుతోంది...
, మంగళవారం, 27 జూన్ 2017 (21:57 IST)
కొన్ని విషయాలు మనకు తెలియవు. కానీ తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి వాటిలో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం... 
1. మన శరీరంలోని నాడీ వ్యవస్థలోని నాడులు ఒక సెకనుకు 300 అడుగుల వంతున సందేశాలు అందిస్తాయి.
2. ప్రపంచంలోకెల్లా అతి చిన్న మానవ ప్రాణి డచ్ దేశానికి చెందిన యువరాణి "పాలిన్". ఆమె తన 12 సంవత్సరాల వయసులో 23.2 అంగుళాలు ఎత్తు ఉండేది.
3. హమ్మింగ్ బర్డ్ సెకనుకు 90 సార్లు వంతున రెక్కలు టపటపలాడిస్తుంది. అంటే నిమిషానికి 5 వేల సార్లు అన్నమాట.
4. ప్రపంచంలోని 2 లక్షల పూల రకాల్లో అతిచిన్న పుష్పం పేరు డక్ వీడ్. దీనిని మైక్రోస్కోపు క్రింద మాత్రమే చూడవచ్చును. 
5. పవర్ ఫిష్ ఉమ్మిలాంటి ద్రవంతో పారదర్శకమైన ఒక సంచిని తయారుచేసుకుంటుంది. సముద్రంలోని ఇతర కీటకాల బారి నుండి తనను తాను రక్షించుకుంటుంది. సంతోషంగా నిద్రపోతుంది.
6. ఒక సాధారణ లెడ్ పెన్సిల్‌తో 35 మైళ్ల పొడవైన గీత గీయవచ్చును. అదే పెన్సిల్‌తో ఆంగ్ల భాషలోని 50 వేల పదాలను రాయవచ్చును.
7. అంతరిక్ష ధూళి కారణంగా మన భూమి బరువు రోజుకు 100 టన్నులు పెరుగుతోంది.
8. పసిఫిక్ మహాసముద్రం వైశాల్యంలో ఎంత పెద్దదంటే భూమి ఉపరితలంలో 1/3వ వంతు ఆక్రమిస్తుంది. భూమి మీది ఖండాలన్నింటినీ ఒకచోట చేర్చినా పసిఫిక్ మహాసముద్రమే దానికంటే పెద్దదిగా ఉంటుంది.
9. ఒక పావురం యొక్క ఎముకలు దాని ఈకల కంటే తక్కువ బరువును కలిగి ఉంటాయి.
10. గాడిద కళ్లు దాని తలపై ఎంత చక్కగా అమరివుంటాయంటే అది ఒకేసారి తన నాలుగు కాళ్ళను చూసుకోగలదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రొమాన్సును ఉన్నట్టుండి ఆపేస్తే.. గుండెకు ప్రమాదమా?