Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం... ప్రతి 20 మంది మహిళల్లో ఆరుగురు...

బహిరంగ ధూమపానం వలన అత్యంత దారుణ దుష్ఫలితాలు ఉంటాయి, పక్కవాళ్లు స్మోక్ చేయడం వలన వచ్చే పొగను అప్రయత్నంగా పీల్చడం ద్వారా ఇతరులు ప్రాణాపాయానికి గురవుతుంటారు. భారతదేశంలో గుండెజబ్బులు సంభవిస్తున్న ప్రతి 20 మహిళల్లో దాదాపు 6 మంది ఈ పాసివ్ స్మోకింగ్ చేతనే మ

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం... ప్రతి 20 మంది మహిళల్లో ఆరుగురు...
, బుధవారం, 26 ఏప్రియల్ 2017 (15:58 IST)
బహిరంగ ధూమపానం వలన అత్యంత దారుణ దుష్ఫలితాలు ఉంటాయి, పక్కవాళ్లు స్మోక్ చేయడం వలన వచ్చే పొగను అప్రయత్నంగా పీల్చడం ద్వారా ఇతరులు ప్రాణాపాయానికి గురవుతుంటారు. భారతదేశంలో గుండెజబ్బులు సంభవిస్తున్న ప్రతి 20 మహిళల్లో దాదాపు 6 మంది ఈ పాసివ్ స్మోకింగ్ చేతనే మృత్యువాతన పడుతున్నట్లు వెల్లడైంది. బహిరంగ స్థలాల్లో పొగ త్రాగితే కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు రూపొందించినా మార్పు కనిపించడం లేదు. స్మోకింగ్ ప్రభావం వలన అనేక మంది మహిళలకు క్యాన్సర్‌లు వస్తున్నాయి.
 
పాసివ్ స్మోకింగ్ వలన మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. చిన్నారులకు బ్లడ్ క్యాన్సర్‌లు రావచ్చు. పొగరాయుళ్లు వదిలే పొగ నుండి బయటబడే విష ప్రభావం వల్ల గర్భిణుల్లో పిండానికి రక్త సరఫరా సరిగ్గా జరగదు. ఈ కారణం చేత పుట్టే పిల్లలకు గుండె జబ్బులు, నరాల బలహీనత, ప్రేగు క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ విధమైన ప్యాసివ్ స్మోకింగ్ బాధిత మహిళలు సాధారణం కన్నా ఆరు ఏళ్లకు ముందే పునరుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతారు. అదే రీతిన మానసికంగానూ, మతిభ్రంశం చెందడం, వ్యాకులత, పొందిక సంబంధంలేని ఆలోచనలు వంటి వ్యాధులకు గురవుతారు.
 
ధూమపానం చేసేవారు గుర్తుంచుకోవాలి, వారు సభ్యతా సంస్కారం లేకుండా ఎక్కడపడితే అక్కడ, ఇంట్లోనూ, బహిరంగ ప్రదేశాల్లోనూ ధూమపానం చేయడం ద్వారా వాళ్ల ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాకుండా ఇతరుల అనారోగ్యానికి కారణమవుతారు. కనుక ఇలాంటి తప్పులు చేసేవారికి కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా తీవ్రమైన శిక్షలు విధించేలా ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేయాలి. పొగరాయుళ్ల ప్రక్కన నిల్చున్న దోషానికి ఏ తప్పు చేయకుండానే అనేకమంది అనారోగ్య సమస్యలు గురువుతున్నారు! ముఖ్యంగా మనం సిగరెట్ వెలిగించకుండానే తీసుకునే పొగ... సాధారణ ధూమపానం కంటే ఎక్కువ ప్రమాదమైనది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోధుమపిండితో ఎగ్ స్టఫ్డ్ పరోటా ఎలా చేయాలో చూద్దాం..