Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గురక ఎందుకు వస్తుంది.. అందుకు పరిష్కారం ఏంటీ..?

గురక ఎందుకు వస్తుంది.. అందుకు పరిష్కారం ఏంటీ..?
, శుక్రవారం, 7 డిశెంబరు 2018 (12:51 IST)
చాలామంది గురక సమస్యతో బాధపడుతుంటారు. గురక అనేది కూడా ఓ వ్యాధే. ఈ వ్యాధి గలవారు ఎక్కడ నిద్రించినా తప్పకుండా ఈ సమస్య వారిని వెంటాడుతూనే ఉంటుంది. అంతేకాదు.. పక్కనున్నవారిని కూడా నిద్రపోనివ్వకుండా చేస్తారు. అసలు గురక ఎందుకు వస్తుందో తెలుసుకుందాం..
 
గురక సమస్య:
1. గొంతులోని శ్వాసకు సంబంధించిన కండరాల బలహీనత. ఒకవేళ ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఆ కండరాలు మరింతంగా రిలాక్స్ అయిపోవడం వలన గురక మరింత ఎక్కువగా వస్తుంది. దీంతో సమస్య తీవ్రం కావొచ్చు.
 
2. కొందరిలో గొంతులోని కండరాలు మందంగా మారడం వలన గాలి ప్రవహించే నాళం సన్నబడవచ్చు. కొన్నిసార్లు అంగిలి వెనుక మృదువుగా ఉండే భాగం పొడవు పెరగొచ్చు. అంతేకాదు.. ముక్కులో ఏవైనా అడ్డంకులు వచ్చినందువలన శ్వాస తీసుకోవడానికి మరింత గట్టిగా గాలి పీల్చాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలోనే శబ్దం గట్టిగా వస్తుంది. 
 
పరిష్కారం:
1. మీ బరువును అదుపులో ఉంచుకోవాలి. నిద్రకు ముందు మత్తు కలిగించే పదార్థాలు, స్లీపింగ్ పిల్స్ వంటివి వాడకూడదు. అలర్జీని అదుపులో ఉంచే మందులైన యాంటీ హిస్టమైన్స్ తీసుకోకండి.
 
2. ఆల్కహాల్ తీసుకోరాదు. అలా చేయకపోతే కనీసం నిద్రవేళకూ, మద్యం తీసుకోవడానికి మధ్య నాలుగా గంటలూ, నిద్రకూ, కడుపు నిండుగా భోజనానికి మధ్య మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. 
 
3. నిద్రవేళలు క్రమబద్ధంగా ఉండాలి. వెల్లికిల పడుకోవడానికి బదులుగా ఒకవైపునకు ఒరిగి పడుకోండి. మీ తలను మీ పడకకంటే నాలుగు అంగుళాల ఎత్తుగా ఉండేలా తలగడ అమర్చుకోండి.   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్తమా వ్యాధికి చెక్ పెట్టాలంటే.. ఇది తీసుకోవాల్సిందే..?