Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ 6 కారణాలు తెలిస్తే కౌగలింత తప్పకుండా....

ఈ 6 కారణాలు తెలిస్తే కౌగలింత తప్పకుండా....
, శుక్రవారం, 4 జనవరి 2019 (18:26 IST)
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో బంధాల మీద, బంధుత్వాల మీద ప్రేమ అనేది కరువైపోతుంది. మనకు నచ్చిన వారిని, మన ఆత్మీయులని  ప్రేమతో పలకరించడమే కాదు. అప్పుడప్పుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం చేస్తుండాలట. ప్రేమను వ్యక్తం చేయడానికి ఇంత కన్నా మంచి మార్గం లేదు. ఇది నిజం. కౌగిలింత ఒక నమ్మకం, ఒక భరోసా. ఈ కౌగిలింత వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
 
అమ్మానాన్నాల ప్రేమని, ప్రేయసిప్రియుల పరవశాన్ని, అక్కాచెల్లెళ్ల, అన్నదమ్ముల అనురాగాన్ని, స్నేహితుల బాంధవ్యాన్ని, క్రీడాకారుల విజయోత్సాహాన్ని... ఒకటనేమిటి అన్ని రకాల భావోద్వేగాలను అద్భుతంగా వ్యక్తం చేయగలిగే చక్కని పలకరింపే కౌగిలింత.
 
1. నవ్వులానే అనేక వ్యాధుల నివారణకు బిగి కౌగిలి అద్భుత చికిత్స. నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఒత్తిడి, డిప్రెషన్, భయాందోళనలను తగ్గిస్తుంది. చిన్నిపిల్లల్ని కుటుంబ సభ్యులంతా ఎత్తుకుని హత్తుకునే ఆ స్పర్శలోని వెచ్చదనం పెద్దయ్యేవరకు కూడా నరాల్లో అంతర్లీనంగా దాగే ఉంటుంది. కౌగిలింతలకు నోచుకోని పిల్లల్లో ఐక్యూ మందగిస్తుందనీ, ఫలితంగా నడవడం, మాట్లాడటం, చదవడం..... ఆలస్యమవుతాయన్నది ఓ అధ్యయనంలో తేలింది. 
 
2. కౌగిలింత వల్ల పాజిటివ్ ఎనర్జీ ఒకరి నుంచి మరొకరికి ప్రసరిస్తుంది. దాంతో థైమస్ గ్రంధి ప్రభావితమై తెల్ల రక్త కణాల ఉత్పత్తి ఎక్కువై రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
 
3. ఆలింగనం కండరాల్ని వ్యాకోచించేలా చేయడంతో రక్తప్రసారం మెరుగై కణజాలాలు మృదువుగా మారడంతో గుండెజబ్బులు రావు.
 
4. తనువంతా పులకించేలా కౌగిలించుకుంటే అంటే... ఇద్దరి చర్మాల రాపిడికి ఒకలాంటి విద్యుచ్చక్తి ఒకరి నుండి మరొకరికి ప్రవహించి నాడీ వ్యవస్థను ప్రభావింపచేస్తుందట.
 
5. కౌగిలి ఓ థెరఫీలా పనిచేస్తుందన్న విషయాన్ని మిచిగాన్‌లోని కారోకి చెందిన డాక్టర్ రెవరెండ్ కెవిన్ జుబోర్ని గుర్తించి, మొదటగా 1986లో జనవరి 21ని కౌగిలింతల దినోత్సవంగా రిజిస్టర్ చేశాడు. 
 
6. పెంపుడు జంతువులను దగ్గరకు తీసుకున్నా, లేదంటే మీకిష్టమైన సాప్ట్ టాయ్‌ని హత్తుకున్నా మంచిదే అంటున్నారు నిపుణులు. అందుకే మరి... కౌగిలి అనేకానేక వ్యాధులకు శక్తివంతమైన ఔషధం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జున్ను తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?