Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో చర్మ సంరక్షణ ఇంట్లోనే సాధ్యం.. ఎలాగంటే?

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2016 (16:28 IST)
వేసవిలో చర్మ సంరక్షణకు ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అందాన్ని ఆరోగ్యాన్నిపదిలంగా కాపాడుకోవచ్చు. ఎలాగంటే  
1. పెట్రోలియం జెల్లీలో, కొద్దిగా గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు పొడిబారిన చర్మానికి, చేతులకి, కాళ్లకి రాస్తే శరీరం మృదువుగా మారుతుంది.
 
2. కొబ్బరి నూనెలో రోజ్‌మెరీ, లావెండర్ సుగంధ తైలాలను కలిపి మసాజ్ చేసినట్టయితే శరీరం నునుపుగా తయారవుతుంది. మసాజ్ వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. 
 
3. దోసకాయ చెక్కుతీసి బాగా తురిమి రసాన్ని తీయాలి. ఈ రసంలో అరటీస్పూన్ గ్లిజరిన్, అరటీస్పూన్ రోజ్‌వాటర్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎండకు కమిలిన ప్రదేశంలో రాసి ఆరేంతవరకు ఉంచి శుభ్రపరుచు కోవాలి. ఇలా రోజూ చేస్తే క్రమేణా కమిలిన భాగం మామూలుగా అయిపోతుంది.
 
4. పాదాలు పగిలినట్లయితే పారాఫిన్ వాక్స్‌ను కరిగించి, అందులో కొద్దిగా ఆవాల నూనెను కలిపి పగుళ్లు ఉన్న చోట రాస్తే పాదాలు మృదువుగా అవుతాయి. ఈ మిశ్రమం అందుబాటులో లేకుంటే గ్లిజరిన్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి కాలి పగుళ్లకు రాస్తే నునుపుగా అవుతాయి.
 
5. చేతులు, పాదాలపై ఉండే గరుకుదనం, నలుపు, జిడ్డు మురికి పోవాలంటే నిమ్మ చెక్కతో రుద్దాలి. రోజుకు ఒకసారైనా సబ్బుతో ముఖం కడగాలి. కడిగిన తర్వాత ఐస్‌క్యూబ్‌తో ముఖమంతా మసాజ్ చేసినట్లు రుద్దాలి. రోజుకు కనీసం మూడు సార్లు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. 

మీ స్మార్ట్‌ఫోన్లే మీ ఆయుధాలు.. సీఎం జగన్ పిలుపు

మలేషియాలో ఘోరం.. నౌకాదళ హెలీకాఫ్టర్ల ఢీ.. పది మంది మృతి

ముస్లింలకు అధికంగా పిల్లలున్నారా? మోదీ గారూ ఏం మాట్లాడుతున్నారు?

రామ్ గోపాల్ వర్మ హత్యకు టీడీపీ కుట్ర.. పోసాని సంచలన వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ ఆస్తులు రూ. 114.7 కోట్లు, అప్పులు రూ. 64.26 కోట్లు, కట్టిన పన్ను రూ. 73 కోట్లు

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం టైటిల్ గా కూలీ

హనుమాన్ జయంతి సందర్భంగా జై హనుమాన్ IMAX 3D న్యూ పోస్టర్ విడుదల

సాయి దుర్గ తేజ్ ఆవిష్కరించిన పడమటి కొండల్లో ఫస్ట్ లుక్

తెలుగు కథతో సీతా కళ్యాణ వైభోగమే పెద్ద విజయం సాధిస్తుంది: ప్రీ రిలీజ్ లో వక్తలు

సందీప్ కిషన్, రావు రమేష్ ప్రధాన పాత్రలతో త్రినాధ రావు నక్కిన చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments