Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రిజ్‌లో ఉంచిన పదార్థాలను వేడి చేసి తింటున్నారా?

ప్రస్తుతం చాలామటుకు ఆహార పదార్థాలన్నింటిని ఫ్రిజ్‌లో వుంచి తీసుకుంటుంటాం. దోసెలు, ఇడ్లీలు తయారు చేసే పిండితో పాటు మిగిలిన ఆహార పదార్థాలన్నింటినీ.. ఫ్రిజ్‌ల్లో పెట్టెస్తుంటాం. అయితే అన్నీ ఆహార పదార్థాల

ఫ్రిజ్‌లో ఉంచిన పదార్థాలను వేడి చేసి తింటున్నారా?
, గురువారం, 20 జులై 2017 (18:32 IST)
ప్రస్తుతం చాలామటుకు ఆహార పదార్థాలన్నింటిని ఫ్రిజ్‌లో వుంచి తీసుకుంటుంటాం. దోసెలు, ఇడ్లీలు తయారు చేసే పిండితో పాటు మిగిలిన ఆహార పదార్థాలన్నింటినీ.. ఫ్రిజ్‌ల్లో పెట్టెస్తుంటాం. అయితే అన్నీ ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో వుంచడం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు వంటి పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టొచ్చు. కానీ వండిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టకూడదు. 
 
అలాగే ఫ్రిజ్‌లో వుంచిన ఆహారాన్ని వేడి చేసి తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజన్ అవుతుంది. కొన్ని ఆహార పదార్థాలను వేడి చేసి తీసుకోకూడదు. తద్వారా పేగులను అది దెబ్బతీస్తుంది. అజీర్తి సమస్యలు, వీర్యలోపం ఏర్పడుతాయి. పీచు పదార్థాలు అధికంగా గల ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో వుంచి వేడి చేసి తీసుకోకూడదు. అలా చేస్తే వీర్యలోపం తప్పదు.
 
ఐరన్, నైట్రేట్లు అధికంగా గల ఆకుకూరలను వండిన తర్వాత ఫ్రిజ్‌లో వుంచితే క్యాన్సర్ ఏర్పడే అవకాశం ఉంది. కోడిగుడ్లను ఫ్రిజ్‌ నుంచి తీశాక మళ్లీ వేడి చేసి తీసుకోకూడదు. ఒకసారి ఉడికించిన బీట్ రూట్, పొటాటోలను ఫ్రిజ్‌లో పెట్టి వేడి చేసి తీసుకుంటే వీర్యలోపం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంటిమీద గార పోగొట్టుకోవడం చాలా ఈజీ...