Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పళ్ల రసాలు, పెరుగు, కాఫీ వంటి ఆమ్ల పదార్థాలు తీసుకున్నాక బ్రష్ చేయొచ్చా?

ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేయడం సహజం. అయితే కొందరు బ్రేక్‌ఫాస్ట్‌ తిన్న తరువాత కూడా పళ్లు తోమడం మంచిది కాదు. ఎందుకంటే పళ్లరసాలు, పెరుగు, కాఫీ వంటి ఆమ్లపదార్థాలు తీసుకున్నాక ఎనామిల్‌ మెత్త బడుతుంది. అప్ప

పళ్ల రసాలు, పెరుగు, కాఫీ వంటి ఆమ్ల పదార్థాలు తీసుకున్నాక బ్రష్ చేయొచ్చా?
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (10:00 IST)
ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేయడం సహజం. అయితే కొందరు బ్రేక్‌ఫాస్ట్‌ తిన్న తరువాత కూడా పళ్లు తోమడం మంచిది కాదు. ఎందుకంటే పళ్లరసాలు, పెరుగు, కాఫీ వంటి ఆమ్లపదార్థాలు తీసుకున్నాక ఎనామిల్‌ మెత్త బడుతుంది. అప్పుడు బ్రష్ చేస్తే ఎనామిల్‌ పోతుంది. అందుకే అల్పాహారం తర్వాత దంతధావనం చేయకపోవడం ఉత్తమమని డెంటిస్టులు అంటున్నారు. 
 
అలాగే ఉదయం నిద్రలేవగానే కళ్లలో తేమ అంతగా ఉండదు. దానివల్ల నిద్రలేచీ లేవగానే ఫోన్‌ స్ర్కీన్‌ చూస్తే కళ్లకు హాని కలుగుతుంది. ఉదయం పిండిపదార్ధాలతో ఉన్న అల్పాహారం తింటేనే పొట్ట నిండుగా ఉంటుందనుకుంటే పొరపాటు. చక్కెర కలిగిన తృణధాన్యాలు, బ్రెడ్‌ వంటివి తింటే సరళ పిండిపదార్థాలు శరీరానికి చేరతాయి. దాంతో త్వరగా ఆకలవుతుంది. అందుకని ప్రొటీన్లు లేదా నట్స్‌‌తో తయారుచేసిన స్మూతీలు తినాలి. ఇవేవీ కుదరలేదంటే ఓట్స్ తీసుకుంటే బెస్ట్. 
 
శరీరానికి శక్తి కావాలంటే.. కంటినిండా నిద్ర ఉండాలి. గోరువెచ్చటి నీళ్లతో ఉదయంపూట స్నానం చేస్తే అలసట, బద్ధకం వదిలిపోతుంది. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం ద్వారా కండరాలు రిలాక్స్ అవుతాయి. తద్వారా అలసట, నీరసం దూరం అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30 రోజుల్లో మీ పొట్ట క‌రిగిపోతుంది... ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు...