Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పుట్నాలు.. ఆరోగ్య ప్రయోజనాలు.. గర్భిణీ మహిళలు తీసుకుంటే?

పుట్నాలు.. ఆరోగ్య ప్రయోజనాలు.. గర్భిణీ మహిళలు తీసుకుంటే?
, శనివారం, 25 డిశెంబరు 2021 (22:37 IST)
Dry Raosted Chana Dal and putnalu
కొవ్వు రహిత ఆహారాలకు దూరంగా ఉండటం, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రొటీన్లు అధికంగా ఉండే పుట్నాలను రోజు వారీ ఆహారంలో తరచుగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం, దీర్ఘాయువు మెరుగుపడుతుంది. పుట్నాలలో సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్, ఫైబర్ ద్వారా మనం తిన్న ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. 
 
అలాగే శరీరంలోని వ్యర్థాలను తొలగించి, అంతర్గత అవయవాలను శుభ్రపరచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పుట్నాలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి, ఇది మంచి ఆరోగ్యానికి అవసరం. కణాలు, కణజాలాలు, ఎముకలు, కండరాల నిర్మాణానికి ప్రోటీన్ అవసరం. ఈ పుట్నాలను తీసుకుంటే చర్మం నుండి దద్దుర్లు, గజ్జి, తామరలను త్వరగా తొలగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. చర్మంపై ముడతలను తొలగిస్తుంది.
 
ఈ పుట్నాలను ఎక్కువగా తింటే జుట్టు రాలడం వుండదు. శిరోజాలు నెరిసిపోవడం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. గర్భిణీ స్త్రీలు పుట్నాలను సరైన నిష్పత్తిలో తీసుకోవడం వల్ల వారికి గర్భస్థ శిశువుకు మేలు జరుగుతుంది. ప్రసవ సమయంలో నొప్పి, శారీరక అలసట నుండి ఉపశమనం పొందడంలో పుట్నాలు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోధుమ రొట్టె కంటే జొన్న రొట్టెలో మెరుగైన ప్రయోజనాలున్నాయా?