Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీ చరిత్ర... ఆరోగ్యం, విశేషాలు...

టీ చరిత్ర... ఆరోగ్యం, విశేషాలు...
, బుధవారం, 11 మే 2016 (17:21 IST)
* చైనా చక్రవర్తికి 'గరం గరం చాయ్
* టీ ని మొదట ఎవరు కనిపెట్టారో తెలుసా?
షెన్‌నుంగ్ అనే చైనా చక్రవర్తి. ఒకరోజు కమ్మటి వాసన వస్తుంటే ఆయన ఎక్కడ్నించి వస్తోందా అని పొయ్యి దగ్గరికి వెళ్లి చూశాడట. పొయ్యి మీద కాగుతున్న నీళ్లలో ఎక్కడ్నించో రెండు ఆకులు పడి దాన్నుంచి ఆ వాసన వస్తోందని గమనించాడట. అంతే పానీయ సామ్రాజ్యంలో పెద్ద విప్లవమే వచ్చేసింది. టీ ఆ విధంగా క్రీస్తు పూర్వం లోనే చరిత్రలో రికార్డయింది.19వ శతాబ్దం ముందు వరకు చైనాలో టీ కట్టలు డబ్బుగా చెలామణి అయ్యేవట కూడా.
 
* 200 కోట్ల మందికి ఫేవరేట్...
మంచినీరు తరువాత జనం ఎక్కువగా తాగేది టీ. ప్రతిరోజూ దాదాపు 200 కోట్ల మంది టీ తాగుతారని అంచనా. చాలామందికి కప్పు టీ గొంతులో దిగితే గానీ రోజు మొదలవదు. టీ చెట్టును కామెల్లియా సినసిస్ అంటారు. ఈ చెట్లు 30 అడుగులు దాకా కూడా పెరుగుతాయి.
 
* నాలుగు రకాలు ప్రధానం...
వైట్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఊలాంగ్ టీ అని టీలో నాలుగు ప్రధాన రకాలున్నాయి. ఆయా ప్రాంతాల అభిరుచుల్ని బట్టి వీటి నుంచే కొన్నివేల రకాల్ని తయారుచేస్తున్నారు. అయితే అన్ని టీలకు మూలం మాత్రం అదే కామెల్లియా సినసిస్ చెట్టు. టీ ఆకును శుభ్రపరిచి భద్రపరచడంలో ఉన్న తేడాలను బట్టి రంగులో, నాణ్యతలో తేడాలొస్తాయి. టీ గ్రేడింగ్ రుచి, రంగును బట్టి జరగదు. ఆకుల సైజు, నునుపుల్ని బట్టి జరుగుతుంది. ఎనిమిది రకాలు ప్రధానం. ఆరెంజ్ పెకో రకం అత్యుత్తమ నాణ్యత కలిగిందైతే పెకో(పి) అన్నిటికన్నా నాసిరకం. వైట్ టీ రకాన్ని ఆక్సిడేషన్ లేకుండా తక్కువ ప్రాసెస్‌తో తయారు చేయవచ్చు. గ్రీన్ టీకి అవసరం మేరకు ఆక్సిడేషన్ చేస్తారు. బ్లాక్ టీకి మాత్రం ఆకులన్నిటినీ ఆక్సిడైజ్ చేయాల్సిందే. చివరి రకమైన ఊలాంగ్ టీకి సగం ఆక్సిడేషన్ చేస్తారు. ప్రపంచంలో ఉత్పత్తవుతున్న టీలో 75 శాతం టీ బ్లాక్ టీ, 23 శాతం గ్రీన్ టీ, 2 శాతం ఊలాంగ్ టీ.
 
* ఇది టీ వాదం...
చాలామంది టీ వలన ఆరోగ్యానికి హాని జరుగుతుందని అనుకుంటారు. అది నిజం కాదు. టీలో ఉన్న బొహీక్ యాసిడ్, టన్నిస్, థియెఫిలైన్స్, కొద్దిపాటి కెఫిన్ ఆరోగ్యానికి మంచివే. వీటికి తోడు యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ కూడా అధికంగా ఉంటాయి.
 
టీలోని ఈ యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్.. మనకు ఎన్నో రోగాలను రాకుండా కాపాడగలవు. ఒత్తిడి, డయాబెటిస్, క్యాన్సర్, దంతక్షయం... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రోగాల నుంచి టీ రక్షించగలదు. అంతేకాదు వయసును తగ్గిస్తుంది. శరీరం ముడుతలు పడకుండా కాపాడుతుంది. ప్రత్యేకించి వేసవి కాలంలో దాహం తీర్చే గుణం టీలో ఉంది. టీలోని 500 రసాయనాలు బరువును కూడా తగ్గిస్తాయి.
 
అణుధార్మిక రసాయనాల వలన కలిగే హానిని నివారించగలదు కాబట్టి టీని 'అణుయుగపు పానీయం' అని కూడా అంటున్నారు. ఒకానొక పరిశోధన చెప్పిన సత్యం ఏమిటంటే- రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద అణుబాంబులు పడ్డాక కూడా బతికున్న వాళ్లలో ఎక్కువమందికి చాలా ఏళ్లుగా టీ తాగే అలవాటు ఉందని. టీలో పాలు వేసుకుని తాగడం వల్ల శరీరానికి విటమిన్స్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు లభించి ఎముకలు దృఢంగా తయారవుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
 
* టీ తోటల పెంపకం..
మన దేశంలో డార్జిలింగ్, అస్సాం, నీలగిరి అనే మూడు ప్రాంతాల్లో టీ తోటలు విస్తారంగా ఉన్నాయి. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. డార్జిలింగ్‌లో దొరికే టీ బంగారు రంగును పోలి ఉంటుంది. అస్సాంలో లభించే టీ డార్జిలింగ్‌లో లభించే రంగుకంటే మరింత డార్క్. ఈ ప్రాంతం బ్లాక్ టీకి బాగా ప్రసిద్ధి. నీలగిరిలోని టీ సువాసనకు ప్రసిద్ధి.
 
* టీ సత్యాలు...
* ప్రతీ రోజూ టీని తాగితే 108 సంవత్సరాలు జీవించవచ్చని చైనీయులు నమ్ముతారు.
 
* మూడు కప్పుల టీ తాగితే ఆరు యాపిల్ పండ్లను తిన్నదానితో సమానం.
 
* లండన్ కింగ్స్ కాలేజ్ టీ మీద పరిశోధన జరిపి వెల్లడించిన విషయం ఏమిటంటే... ఒక టీ కప్పులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఒక కప్పు పండ్ల రసం కంటే అధికం. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిమ్మరసంతో చుండ్రుకు శాశ్వత పరిష్కారం