Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బరువును ఇలా సులభంగా తగ్గించుకోవచ్చు...!

ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అందరికీ ఉన్నా ఆశ తమ బరువు తగ్గించుకోవడం ఎలా అని... అధిక బరువును తగ్గించుకునే మార్గాలను అన్వేషిద్ధాం.

బరువును ఇలా సులభంగా తగ్గించుకోవచ్చు...!
, సోమవారం, 23 జనవరి 2017 (14:48 IST)
ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అందరికీ ఉన్నా ఆశ తమ బరువు తగ్గించుకోవడం ఎలా అని... అధిక బరువును తగ్గించుకునే మార్గాలను అన్వేషిద్ధాం.
 
మొదటి రోజున అరటిపండు తప్ప అన్ని రకాల తాజా పళ్ళు మీ ఆహారంగా తీసుకోవాలి. మీకు నచ్చిన అన్ని రకాల పండ్లను తినొచ్చు. ప్రత్యేకించి పుచ్చకాయలు, కిరిణీకాయలు ఎక్కువ తీసుకుంటే మంచిది. పరిమితి ఏమీ లేదు. మీకు ఎంత తినాలనిపిస్తే అంత తినొచ్చు. పళ్ళను ఆహారంగా తీసుకోవడం వల్ల రాబోయే ఆరు రోజులకు మీ శరీరాన్ని, జీర్ణవ్యవస్థను సిద్ధపరుస్తున్నట్లు అర్థం.
 
రెండోరోజున ఆహారం కేవలం కూరగాయలు మాత్రమే తినాల్సి ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్‌గా ఒక పెద్ద బంగాళాదుంపను ఉడికించి తినటం ద్వారా ఈ రోజున మొదలుపెట్టండి. తర్వాత బంగాళాదుంప తినొద్దు. మిగతా కూరగాయలు పచ్చివి కానీ, ఉడికించినవి కానీ తినొచ్చు. ఉప్పు, కారం మీ ఇష్టం. నూనె మాత్రం వాడకూదడు. మీకు నచ్చినంత తినొచ్చు.
 
మూడోరోజున అరటిపండు, బంగాళాదుంప తప్ప మిగిలిన పళ్ళు, కూరగాయలు కలిపి తీసుకోవచ్చు. మీకు కావాల్సినంత తినొచ్చు. ఇప్పటి నుంచి మీ శరీరంలో అదనపు కొవ్వు విలువలు కరగటం ప్రారంభం అవుతుంది.
 
నాలుగోరోజు 8 అరటిపళ్ళు మూడు గ్లాసుల పాలు తీసుకోవాలి. నాలుగోరోజు దాదాపు ఆకలి ఉండకపోగా రోజంతా హాయిగా గడిచిపోవడం గమనిస్తారు. 8 అరటిపళ్ళు తినాల్సిన అవసరం దాదాపు రాదనే చెప్పాలి. తగ్గించగలిగితే మరింత మంచిది. మీకు ఏదైనా ఇంకా త్రాగాలనిపిస్తే 100మి.లీ. వెజిటబుల్ సూప్ తాగవచ్చు. తాజా కూరగాయలతో మీ అభిరుచికి తగ్గట్లు మీ ఇంట్లో తయారుచేసింది మాత్రమే తాగండి. 
 
ఐదోరోజు ఒక కప్పు అన్నం, ఆరు టమోటాలు, తీసుకోవాలి. ఇక మధ్యాహ్నం ఒక కప్పు అన్నం, దానిలోకి కూరగయాలు లేదా ఆకుకూరలతో నూనె లేకుండా వండిన కూరతో తీసుకొని ఉదయం టిఫిన్‌గా రెండు టమోటాలు తీసుకోండి. కప్పు అన్నం మాత్రమే తినాలి.
 
ఆరోరోజున ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం తీసుకోవాలి. రెండోరోజు తిన్నట్లు పచ్చివి లేదా వండిన కూరగాయలు తీసుకోవాలి. అన్నంలోకి కూర 5వ రోజు చెప్పినట్లే. కూరగాయలకు లిమిట్ లేదు. అయినప్పటికీ ఆకలి లేకపోవడం వల్ల రెండవరోజు తిన్నంత అవసరం లేదు.
 
ఏడోరోజున ఒక కప్పు అన్నం.. కూరగాయలు, పళ్ళరసం తీసుకోవాలి. ఆరోరోజులాగే తింటూ, ఆనందంగా కూరగాయలను కాస్త తగ్గించి పళ్ళరసం తీసుకోవాలి. మధ్యాహ్నం యధావిధిగా ఒక ఒక కప్పు లేదా అంతకంటే తక్కువ అన్నం తినటానికి ప్రయత్నించాలి. అంతేమార్పు మీరే కాకుండా పక్కవాళ్ళు సైతం కనిపెట్టగలరు. వారం తర్వాత మీకు మీరే అవాక్కవుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రాభివృద్ధికి ప్రవాస తెలుగువారి సేవలు