Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శక్తికిమించి పని.. అయినా ఎంజాయ్ చేస్తున్న మహిళలు.. ఎలా?

శక్తికిమించి పని.. అయినా ఎంజాయ్ చేస్తున్న మహిళలు.. ఎలా?
, మంగళవారం, 16 అక్టోబరు 2018 (18:55 IST)
"ఆడుతుపాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపు ఉండదు".. అనే ఈ సినీపాటను ప్రతి ఒక్కరూ వినేవుంటారు. నిజానికి ఇది ఒక సినిమా పాటే కావొచ్చు. కానీ, ఈ పాటలో గొప్ప జీవిత సత్యం దాగివుంది. పనిలో ఎంత ఆనందాన్ని అనుభవించవచ్చో తెలిపారు. అయితే... ఏదైనా అతిగా పోతే ప్రమాదమే. విపరీతంగా పనిచేయడం వల్ల ప్రాణాలకు కూడా అపాయమేనట.
 
నేటి యువతలో ఒక్క రోజులోనే పెద్దవారైపోవాలన్న తపనవుంది. ఇందుకోసం శక్తికిమించి పని చేస్తున్నారు. అయితే, జపాన్‌, చైనా వంటి దేశాల్లో ఇలా అతిగా పనిచేసి ప్రాణాలు కోల్పోయిన యువత ఎందరో ఉన్నారు. 
 
నిజానికి గుడ్డెద్దు చేలో పడినట్టుగా విపరీతంగా పనిచేసుకుపోవడం యువతకు ఏమాత్రం మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా పని ఉండటం వల్ల విపరీతమైన శారీరక, మానసిక ఒత్తిడులకి ఉద్యోగులు లోనవుతారని, దీనివల్ల ఎనర్జీ లెవెల్స్‌ అనూహ్యంగా పడిపోయి తీవ్రంగా అనారోగ్యంపాలు చేస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. 
 
ఇలా అనారోగ్యం క్షీణిస్తోందని గ్రహించే లోపలే యువత ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. పోటీ ప్రపంచంతోపాటు, సంపాదన, ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను ఎక్కాలనే ఆకాంక్షతో తీవ్రమైన పని ఒత్తిడి బారిన యువతపడుతోంది. పరిస్థితి ఎలా తయారైందంటే ఆఫీసులో గంటల కొద్దీ పనిచేసేవారే కెరీర్‌పట్ల సీరియ్‌సగా ఉంటారనే అభిప్రాయం చాలామందిలో నాటుకుపోయింది. 
 
కానీ అన్నేసి గంటలు పనిచేయడం వల్ల వారి ప్రాణాలకు ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ఎవ్వరూ గుర్తించడంలేదని వారు చెబుతున్నారు. అయితే, అతిగా పని చేసేవారు పని ఒత్తిడి బారినపడుకుండా ఉండాలంటే నీళ్లు బాగా తాగుతుండాలి. పని మధ్యలో బ్రేక్‌ తీసుకుంటుండాలి. కాసేపుతోటి ఉద్యోగులతో పిచ్చాపాటి మాటలు మాట్లాడాలి. వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు. 
 
ఈ విషయంలో పురుషుల కంటే ఆడవాళ్లు ఒత్తిడిని అధిగమించగలగడానికి కారణం వాళ్లు కొద్దిగా టైం దొరికినా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. కష్టసుఖాలు పంచుకుంటారు. ఎంజాయ్‌ చేస్తారు. ఈ గుణాలు మగవాళ్లల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. 
 
అందుకే శక్తికి మించి పనిచేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. వర్కును ఎంజాయ్‌ చేయండి. శరీరానికి కావాల్సినంత విశ్రాంతినివ్వండి. అప్పుడప్పుడు బ్రేక్‌ తీసుకోండి. జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించండి. కొత్త ప్రదేశాలకు వెడుతుండండి. కొత్త మనుషులను కలుస్తుండండి. అప్పుడు మీరు చేసే పని పట్ల మీకు విరక్తి పుట్టదు. పనిలో సమతుల్యత సాధిస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శృంగారం చేస్తూ చేస్తూ 'ఇకా చాలా' అంటాడు... ఇదేమిటో అర్థం కాదు...