Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రలేమితో అనేక అనారోగ్య సమస్యలు... కారణాలు ఇవీ...!

కంటి నిండా నిద్రపోయే రోజులు ఇప్పుడు లేవు. రోజుకు ఆరు గంటల నిద్ర కాదు కదా.. మూడు గంటల పాటు నిద్రపోతే గొప్పే. ప్రస్తుతం నిద్ర సమయాలు పూర్తిగా మారి పోయాయి. రాత్రి పూట పడుకోవాల్సినవాళ్లు ఉదయం పూట పడుకుంటు

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2017 (13:48 IST)
కంటి నిండా నిద్రపోయే రోజులు ఇప్పుడు లేవు. రోజుకు ఆరు గంటల నిద్ర కాదు కదా.. మూడు గంటల పాటు నిద్రపోతే గొప్పే. ప్రస్తుతం నిద్ర సమయాలు పూర్తిగా మారి పోయాయి. రాత్రి పూట పడుకోవాల్సినవాళ్లు ఉదయం పూట పడుకుంటున్నారని, ఉదయం పనిచేయాల్సిన వారు రాత్రి పనిచేస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. 
 
అధిక బరువు, ఉద్యోగ సమయాలు, మానసిక, ఆర్థిక సమస్యలు, టీవీలు, సెల్‌ఫోన్లలో కబుర్లు నిద్రను దూరం చేస్తున్నాయని చెబుతున్నారు. అర్థరాత్రి 2 గంటలు దాటినా నిద్రపోని వారు చాలామంది ఉంటున్నారని, దాదాపు 90 శాతం మంది ప్రజలు 8 గంటల పాటు నిద్రపోవడం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. 
 
ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, బీపీవో, ఐటీ, కాల్‌ సెంటర్లలో పనిచేసే వారు సరిగా నిద్రపోవడం లేదని, వీరు రాత్రి పూట నిద్రకు దూరమవుతున్నారని, కంటినిండా నిద్రలేక, కార్యాలయంలో పనిచేయలేక ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ నిద్రలేమి సమస్య ప్రధానంగా నగర వాసుల్లో కనిపిస్తోంది. 
 
సరైననిద్ర లేకపోతే బీపీ, ఒత్తిడి పెరుగుతుంది. గుండె స్పందనల్లో తేడాలు కనిపిస్తాయి. మధుమేహం నియంత్రణలోకి రాకపోవడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముంది. నిద్రలేమితో బాధపడేవారు గురక వంటి సమస్యలను ఎదుర్కొంటారు. 
 
అంతేకాకుండా, మానసికంగా చిరాకుగా ఉండటం, చేసే పనిమీద ధ్యాస లేకపోవడం, ఆందోళన, ఆతృత, ఒత్తిడి పెరగడం, భయం, భయంగా ఉండటం, బీపీ పెరగడం, గుండె స్పందనలో మార్పులు, నరాల్లో బలహీనత, వణకడం, చేతులు, తిమ్మిర్లు రావడం, రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం వంటివి జరుగుతాయి. 
 
నిద్రలేమికి ప్రధానంగా అధిక బరువు, పని ఒత్తిడి పెరగడం, టీవీలు చూడటం, సెల్‌ఫోన్‌ మాట్లాడటం, టీ, కాఫీ, మద్యం, సిగరెట్లు తాగడం, రాత్రిపూట ఉద్యోగాలు చేయడం, విపరీతంగా ఆలోచన చేయడం వంటి వాటివల్ల నిద్రకు దూరమవుతున్నట్టు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 

కాంగ్రెస్ లీడర్‌గా రాహుల్ ఉండేవరకు బీజేపీకి ఇబ్బంది లేదు.. కిషన్ రెడ్డి

తిరుమల శేషాచలం అడవుల్లో కార్చిచ్చు..

న్యూజెర్సీ దుకాణంలో చోరీ.. ఇద్దరు తెలుగు విద్యార్థుల అరెస్ట్

మోదీ పిరికి రాజకీయ నాయకుడు.. కవిత అరెస్ట్‌పై కేసీఆర్

స్కూల్ కిచెన్‌లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపాల్.. వీడియో వైరల్

మార్కెట్ మహాలక్ష్మి మూవీ ఎలావుందంటే.. రివ్యూ

నేను ఎవరినైనా మర్డర్ చేసినా ఆయనతో చెప్పేస్తా: సమంతకు అతడే నమ్మకం

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సారంగదరియా- టీజర్‌ను విడుదల చేసిన హీరో శ్రీవిష్ణు

అయోధ్య రామమందిరాన్ని సందర్శించిన Mr బచ్చన్ టీం

కాంతారా 2లో మోహన్ లాల్ నటిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments