Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్యాడ్ కొలెస్టరాల్‌కు బైబై.. మంచి కొవ్వు పెరగాలంటే.. పెసరపప్పు తినాలట..

Moong Dal
, శనివారం, 26 ఆగస్టు 2023 (10:45 IST)
Moong Dal
ప్రతి ఒక్కరి శరీరానికి తగినంత కొలెస్ట్రాల్ అవసరం. ఈ కొలెస్ట్రాల్ జీవక్రియను సమర్థవంతంగా అమలు చేయడంలో సహాయపడుతుంది. అయితే శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుందని అందరికీ తెలియదు. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
కానీ ఈ రోజుల్లో, అధిక కొలెస్ట్రాల్ చాలా మందిలో సాధారణ సమస్యగా మారింది. చెడు కొలెస్ట్రాల్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో రోజురోజుకు వేగంగా పెరిగిపోతోంది. అయితే ఈ చెడు కొవ్వు పెరగడానికి చాలా కారణాలున్నాయి. 
 
అనారోగ్యకరమైన ఆహార పదార్థాల వినియోగం, ఆధునిక జీవనశైలి కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం విపరీతంగా పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా చెడు కొవ్వు పెరగడం వల్ల శరీరంలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు, కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అధిక రక్తపోటు, గుండెపోటుకు గురవుతున్నారు. అందువల్ల, ఈ సమస్యలను నివారించడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.
 
కొలెస్ట్రాల్ కారణంగా తరచుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఆరోగ్య నిపుణుల సూచన మేరకు రోజువారీ ఆహారంలో పెసర పప్పును తీసుకోవాలి. ఇందులోని గుణాలు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.
 
ఇంకా శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అలాగే దీని వల్ల శరీరాన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు. ఈ పప్పులో ఉండే పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, ఫైబర్, విటమిన్ బి6, విటమిన్ సి, ఫైబర్ పోషకాలు కడుపు నిండుగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాట్స్ ఆధ్వర్యంలో విజయవంతంగా నార్త్ ఈస్ట్ క్రికెట్ టోర్నమెంట్