Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆప్యాయంగా కౌగలించుకుంటే... అవన్నీ అంతేసంగతులు...

మానసికంగా ఆందోళనగా ఉన్న వ్యక్తిని ఆప్యాయంగా కౌగిలించుకుంటే... వారి బాధ ఇట్టే మాయమవుతుందట. ప్రేమగా ఇచ్చే కౌగిలితో ఆరోగ్యం సిద్ధిస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ఆరోగ్య లాభం... కౌగిలిలో ఒదిగిపోయిన పురుషుల కన్నా మహిళలకే ఎక్కువగా ఒనగూరుతుందని అమెరికాలోని

ఆప్యాయంగా కౌగలించుకుంటే... అవన్నీ అంతేసంగతులు...
, బుధవారం, 5 సెప్టెంబరు 2018 (17:50 IST)
మానసికంగా ఆందోళనగా ఉన్న వ్యక్తిని ఆప్యాయంగా కౌగిలించుకుంటే... వారి బాధ ఇట్టే మాయమవుతుందట. ప్రేమగా ఇచ్చే కౌగిలితో ఆరోగ్యం సిద్ధిస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ఆరోగ్య లాభం... కౌగిలిలో ఒదిగిపోయిన పురుషుల కన్నా మహిళలకే ఎక్కువగా ఒనగూరుతుందని అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు.
 
కౌగిలిలో తల దాచుకున్నప్పుడు స్త్రీ-పురుషులిద్దరి శరీరీంలోనూ ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయని, వాటి ప్రభావంతో మానసిక సమస్యలు దూరమవుతాయని తెలిసింది. ఆలింగనం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుందట. దీర్ఘ కౌగిలిలో మెదడు చురుకుగా పనిచేయడమే కాకుండా ఇతర శరీర అవయావాలకు పాజిటివ్ వైబ్రేషన్స్ పంపిస్తుందట. కౌగిలి సమయంలో ఫీల్ గుడ్ హార్మోన్లుగా పేరున్న డొపమైన్, సెరోటోనిన్ విడుదలవుతాయని పరిశోధకులు వెల్లడించారు.
 
మూడ్‌ని మార్చడంలో ఈ హార్మోన్లు కీలకంగా పనిచేస్తాయి. ఒంటరిగా ఉన్నామన్న భావన ఏమైనా ఉంటే.... ఆలింగనంతో అది దూరమవుతుందట. మొత్తానికి కౌగిలింతలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విశేషాలున్నాయన్నమాట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గురక సమస్యలతో బాధపడుతున్నారా... ఈ చిట్కాలు పాటిస్తే?