Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముందుంది ముసళ్ల పండుగ.. నీటికొరత తప్పందండి బాబోయ్..

ముందుంది ముసళ్ల పండుగ అన్నట్లు దేశంలో నీటి కొరత తప్పదని, కోట్లాది మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో వున్నాయని నీతి ఆయోగ్ హెచ్చరించింది. మనదేశంలో సమీప భవిష్యత్తులో నీటి కొరత విజృంభిస్తుందని.. 2030 నాటికి న

ముందుంది ముసళ్ల పండుగ.. నీటికొరత తప్పందండి బాబోయ్..
, శుక్రవారం, 15 జూన్ 2018 (17:40 IST)
ముందుంది ముసళ్ల పండుగ అన్నట్లు దేశంలో నీటి కొరత తప్పదని, కోట్లాది మంది ప్రజల ప్రాణాలు ప్రమాదంలో వున్నాయని నీతి ఆయోగ్ హెచ్చరించింది. మనదేశంలో సమీప భవిష్యత్తులో నీటి కొరత విజృంభిస్తుందని.. 2030 నాటికి నీటి కష్టాలు తీవ్ర రూపం దాలుస్తాయని నీతి ఆయోగ్ అంచనా వేసింది. 
 
దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో భూగర్భ జల వనరులు కనిపించని పరిస్థితి రానుందని నీతి ఆయోగ్ ఆ నివేదికలో వెల్లడిచింది. నీటి కొరతకు ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాలు కూడా కారణం అవుతున్నాయి. ముఖ్యమైన ప్రాజెక్టులు, నీటి పంపకాల విషయంలో ఉన్న అడ్డంకులు తొలగించాల్సి అవసరం వుంది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవాలని నీతి ఆయోగ్ సూచించింది. 
 
భారత దేశంలో సురక్షిత మంచి నీరు లభించకుండా ప్రతి సంవత్సరం రెండు కోట్ల మంది మృతి చెందుతున్నారని.. 60కోట్ల మందికి తగినంత మంచి నీరు లభించట్లేదని కాంపోజిట్ వాటర్ మేనేజ్ మెంట్ ఇండెక్స్ (సీడబ్ల్యూఎంఐ) పేరిట నీతి ఆయోగ్ విడుదల చేసిన రిపోర్టులో తెలిపింది. దేశంలోని రాష్ట్రాలు నీటి నిర్వహణ విషయంలో విఫలమవడంతోనే నీటి కొరత ఏర్పడనుందని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది.
 
వర్షపు నీటిని నిల్వ చేయడం, వర్షపు నీరు వృధా కాకుండా వుండేందుకు కొత్త పథకాలను రూపొందించడం.. వంటి అంశాలు నీటి కొరతకు కారణమవుతున్నాయని నీతి ఆయోగ్ వెల్లడించింది. కానీ నీటి నిర్వహణ విషయంలో గుజరాత్ ముందుందని.. ఆపై మధ్యప్రదేశ్, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు నీటి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. 
 
కానీ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని పేర్కొంది. హిమాలయ రాష్ట్రాల విషయానికి వస్తే, త్రిపురలో నీటి లభ్యత బాగుందని, ఆపై హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, అసోం రాష్ట్రాలున్నాయని నీతి ఆయోగ్ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆహారం జీర్ణం కావడం లేదా.. అయితే, ఇలా చేయండి...