Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మణిపాల్ హాస్పిటల్‌లో ‘రోబోటిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను ప్రారంభించిన గవర్నర్

image
, గురువారం, 27 జులై 2023 (22:42 IST)
ఆంధ్రప్రదేశ్ వైద్యరంగానికి విశిష్ఠ సేవలందిస్తున్న మణిపాల్ హాస్పిటల్ విజయవాడ మరో సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. 4వ తరానికి చెందిన డా విన్సీ×రోబోను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ రోబోను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ గురువారం ప్రారంభించారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో మణిపాల్ ఎంటర్పైజెస్ ఛైర్మన్ డా. సుదర్శన్ బల్లాల్, మణిపాల్ హాస్పటిల్ విజయవాడ డైరెక్టర్ సుధాకర్ కంటిపూడి ఇతర ప్రముఖలు పాల్గొన్నారు. 
 
ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, వైద్యరంగంలో మరోకొత్త చరిత్రకు మణపాల్ హాస్పిటల్ తెరతీసిందని చెప్పారు. రొబోటిక్ అసిస్టెడ్ సర్జరీతో ఆంధ్రప్రదేశ్ వైద్యరంగం మరో కీలక మైలురాయిని అందుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. మణిపాల్ హాస్పిటల్స్ వారు ప్రవేశపెట్టిన ఈ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అడ్వాన్స్మెంట్ అనేది ఏపీ ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలో ఒక గొప్ప ముందడుగు అని స్పష్టం చేశారు. రోబోటిక్ సర్జరీతో రోగులకు కచితత్వం ఉంటుందని అన్నారు. దీంతో రోగులు త్వరగా కోలుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ సాంకేతిక ఆవిష్కరణతో శస్త్రచికిత్సా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని చెప్పుకొచ్చారు. ఇలాంటి సాంకేతిక ఆవిష్కరణలతో భారతదేశ వైద్య చరిత్రలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.  
 
డా.సుదర్శన్ బల్లాల్ - ఛైర్మన్, మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా వివిధ వైద్య విభాగాలకు రోబోటిక్ సర్జరీస్‌ను పరిచయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో మణిపాల్ హాస్పిటల్స్ వైద్య సేవలు అందిస్తుంది. దీనిలో భాగంగానే విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్‌లో సరికొత్త సాంకేతికతను తీసుకొచ్చిందని తెలిపారు. వైద్యరంగంలో ఎలాంటి అడ్వాన్స్ పరిజ్ఞానం ఉన్న దానిని అంది పుచ్చుకుంటుందని స్పష్టం చేశారు. ఈ విప్లవాత్మకమైన సర్జికల్ విధానాన్ని ప్రారంభించడం ద్వారా రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తామని తెలియజేశారు. ఇది కేవలం విజయవాడలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ సేవలను అందిపుచ్చుకోవాలని చెప్పారు. 
 
డా. సుధాకర్ కంటిపూడి హాస్పిటల్ డైరెక్టర్, మణిపాల్ హాస్పిటల్, విజయవాడ మాట్లాడుతూ, విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వైద్యరంగంలో అత్యాధునిక వైద్య సాంకేతికతను ముందుకు తీసుకురావలన్నదే మణిపాల్ హాస్పిటల్ విజయవాడ లక్ష్యమని తెలిపారు. అత్యంత నైపుణ్యతగల సర్జన్స్, పోస్ట్ ఆపరేటివ్, రీ హాబ్ కేర్ నిపుణుల బృందంతో అత్యున్నత ప్రమాణాల వైద్యసేవలను అందించడానికి తాము అంకితభావంతో ఉన్నామని తెలిపారు. భారతదేశంలో డా విన్సీ× (4వ తరం) సిస్టమ్స్ సర్జికల్ టెక్నాలజీలో అత్యాధునికమైనదని, దీనిని హాస్పిటల్ నందు నెలకొల్పామని తెలిపారు. ఈ సాంకేతిక అధ్భుతం అన్ని వర్గాల ప్రజలు అత్యున్నత వైద్యసేవలు పొందడానికి తోడ్పడుతుందని గుర్తు చేశారు. పూర్తి సౌకర్యాలు, పూర్తి ఎక్విప్మెంట్, తమ తమ వైద్యరంగంలో నిపుణులైన వివిధ విభాగాలకు చెందిన స్పెషలిస్టులు మరియు వైద్యులు, 24 గంటల అత్యవసర సేవలు గల హాస్పిటల్ మణిపాల్ కావడం తమకు గర్వకారణమని తెలిపారు. ఎటువంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి శిక్షణ పొందిన నిపుణులు 24x7 పాటు అందుబాటులో ఉంటారని తెలిపారు. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ ఎల్లప్పుడు రోగులకు అత్యుత్తమ వైద్య సేవలను అందించడానికి సంసిద్ధతతో ఉందని తెలిపారు.
 
1) సర్జన్లకు ఖచ్చితత్వం, నియంత్రణ 
2) చిన్నగాటు, తక్కువ నొప్పి,  తక్కువ రక్తంతో సర్జరీ 
3) రోబోటిక్ సర్జరీతో రోగి త్వరగా కోలుకుంటారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాలకూరతో అన్ని ప్రయోజనాలున్నాయా?